భద్రకాళిలో మహాపూర్ణాహుతి


Fri,May 17, 2019 03:19 AM

మట్టెవాడ, మే 16: వరంగల్‌ నగరానికి మణిమకుటంగా విరాజిల్లుతున్న శ్రీభద్రకాళి అమ్మవారి కల్యాణబ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించి చతుస్థానార్చన జరిపిన తర్వాత మహాపూర్ణాహుతి నిర్వహించారు. వెలమ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో ఆర్‌ సునీత ఆధ్వర్యంలో సిబ్బంది సకల సౌకర్యాలు కల్పించారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అమ్మవారికి పట్టువస్ర్తాలను, పూలు, పండ్లు తీసుకుని మేళతాళాలతో వేదస్వస్తితో వచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి శోడషోహరపూజ జరిపి అమ్మవారి అనుజ్ఞ గైకొని అభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శరభవాహన సేవ నిర్వహించారు. పాల్గొన్న భక్తులకు ప్రసాదవితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి పుష్ఫరథసేవ వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం ప్రతినిధులు పేరాల మధుసూదన్‌ రావు, బొంపెల్లి వెంకట్రావు, కాకులమర్రి ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంద

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...