సృజనాత్మక బోధన అందించాలి


Fri,May 17, 2019 03:19 AM

భీమారం, మే16: ఇంజినీరింగ్‌ విద్యా బోధన విద్యార్థుల్లో సృజనాత్మకతను రెకేత్తించే విధంగా ఉండాలని ఏఐసీటీఈ సలహాదారులు డాక్టర్‌ నీరజ్‌ సక్సేనా అని అధ్యాపకులకు సూచించారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని ఎర్రగట్టుగుట్ట ప్రాంతంలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో గురువారం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ను జ్యోతి ప్రజలన రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు కలిసి ప్రారంభించారు.ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నాణ్యమైన, సాంకేతిక విద్య జ్ఞానాన్ని పెంపొందించే విధంగా బోధన చేయాలని సూచించారు. జ్ఞానాన్ని సృష్టించుకోవడానికి ఇంటర్‌నెట్‌ ద్వారా నేర్చుకోవాలన్నారు. శాస్త్ర,సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేసే విధంగా బోధన చేయాలన్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేసేలా అధ్యాపకులు బోధన చేయాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు, కిట్స్‌ కాలేజీ సెక్రటరీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకొని పరిశ్రమలకు అవసరమైన విద్యను బోధించేందుకు కారిక్యూలమ్‌ను రూపుపొందించుకొని బోధన చేయాలన్నారు. విద్యార్థులకు సాఫ్ట్‌ స్కిల్స్‌ను, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను మెరుగుపరుచేలా బోధన చేయాలని సూచించారు.విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానాన్ని అధ్యాపకులు అవలంబించుకోవాలన్నారు. మరో అతిథి సౌత్‌ సెంట్రల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌ ఉన్నికిష్ణన్‌ మాట్లాడుతూ విద్యార్థులకు జీవన నైపుణ్యాలను సాంకేతిక విద్యతో పాటు కోడీకరించి నేర్పించే విద్య విధానాన్ని అధ్యాపకులను బలోపేతం చేయడానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నట్లు తెలిపారు. కిట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ అశోక్‌రెడ్డి, ప్రొఫెసర్ల్లు వెంకటేశ్‌, సతీష్‌చంద్ర, రఘుబాబు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...