దివ్యాంగ కేంద్రాలకు పౌష్టికాహారం పంపిణీ


Fri,May 17, 2019 03:19 AM

వరంగల్‌ క్రైం: దివ్యాంగ కేంద్రాల్లో ఉంటున్న విద్యార్థుల సంరక్షణ కొ రకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని ఉమ్మడి జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్‌ మండల పరుశురాములు పేర్కొన్నారు. మానసిక వికలాంగల విద్యాభివృద్ధి-స్వచ్ఛంద సంస్థల పాత్రపై కేయూరోడ్‌లోని అతిథి కేం ద్రంలో నిర్వాహకురాలు సుజాత అధ్యక్షతన సమావేశం నిర్వహించా రు. దీనికి మండల పరుశురాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడు తూ పోషకాహారలోపం వలన చాలా మంది పిల్లలు మానసిక వికలాంగులుగా పుట్టడం జరుగుతుందని, తల్లితండ్రులు వారికోసం ఇ బ్బందిపడకుండా సంరక్షణ కోసం ప్రత్యేక దివ్యాంగ కేంద్రాలకు పౌష్టిహారం పంపిస్తున్నట్లు తెలిపారు. వృత్తి నైపుణ్యం ఉన్న శిక్షకుల ద్వారా విద్యార్థులకు అతిథి సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు. సమాజంలో ఆర్థికంగా స్థిరపడ్డ వ్యక్తులు దివ్యాంగుల సేవకోసం పనిచేస్తున్న సంస్థలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌, స్నేహలత, భారతి, స్వాతి పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...