కేయూలో ఒకరోజు సింపోజియం పోస్టర్ల ఆవిష్కరణ


Fri,May 17, 2019 03:18 AM

రెడ్డికాలనీ, మే 16: కేయూ అంబేద్కర్‌ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 18న విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల సెమినార్‌ హాల్లో ‘బుద్ధిస్ట్‌ ప్రీచింగ్స్‌', బుద్ధజయంతి సందర్భంగా ఒకరోజు సింపోజియం నిర్వహిస్తున్నట్లు అధ్యయన కేంద్రం సంచాలకులు డాక్టర్‌ గాదె సమ్మయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం సింపోజియంకు సంబంధించిన పోస్టర్లను కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కే పురుషోత్తం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాదె సమ్మయ్య మాట్లాడుతూ కార్యక్రమాకి ముఖ్యఅతిథులుగా వీసీ ప్రొఫెసర్‌ ఆర్‌ సాయన్న, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కే పురుషోత్తం, యూజీసీ కో ఆర్డినేటర్‌ ఆచార్య సారంగపాణి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కిషన్‌, తెలంగాణ రాష్ట్ర పురావస్తు సంచాలకులు ఆకునూరి మురళీకృష్ణ, విశ్రాంత ఆచార్యులు భద్రునాయక్‌, దళితరత్న బొమ్మల కట్టయ్య, కేఎంసీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విద్యారెడ్డి, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ హనుమంతు, టెక్నికల్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పుల్లా శ్రీనివాస్‌ హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగం సహా ఆచార్యులు డాక్టర్‌ రాజమణి, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...