ఆదాయాన్నిచ్చే మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యమివ్వాలి


Fri,May 17, 2019 03:18 AM

అర్బన్‌ కలెక్టరేట్‌, మే 16 : రైతులకు అధిక ఆదాయాన్నిచ్చే అటవీ మొక్కల రకాలను వ్యవసాయ భూముల్లో పెంచుటకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన పాటిల్‌ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆగ్రో ఫారెస్ట్రీ పథకం గురించి చర్చించారు. ఆగ్రో ఫారెస్ట్రీలో అంతర పంటలను సాగుచేసుకోవచ్చన్నారు. ఆగ్రో ఫారెస్ట్రీ కింద శ్రీగంధం, టిష్యూ వెదురు రకాలను ప్రోత్సహించాలన్నారు. ఉద్యాన వనశాఖ ద్వారా 100మంది రైతులతో 50వేల శ్రీగంధం మొక్కలను, 15వేల మంది రైతులతో టిష్యూ వెదురు మొక్కలను ఉచితంగా నాటించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కలను పెంచుటకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేయూత ఇవ్వనున్నామన్నారు. రెండు సంవత్సరాల పాటు శ్రీగంధం మొక్కలను సాకితే మంచిగా పెరిగేందుకు మన వాతావరణం అనుకూలంగా ఉంటుందని అన్నారు. టిష్యూల వెదురుకు నీటి సదుపాయం ఉండాలని, స్వల్పకాలంలో అత్యధిక దిగుబడి లభిస్తుందన్నా రు. రైతులకు ఆగ్రో ఫారెస్ట్రీపై అవగాహన కల్పించుటకు సదస్సులు నిర్వహించాలన్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ, ఉద్యానవన, వ్యవసాయ, అటవీశాఖల కన్వర్జెన్సీ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఉన్న నర్సరీలతోపాటు రాష్ట్ర స్థాయి నర్సరీలలో పెంచిన శ్రీగంధం, టిష్యూ వెదురు మొక్కలను రైతులకు సరఫరా చేయనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వో రామలింగం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాల్‌, జిల్లా హార్టీకల్చర్‌ ఆఫీసర్‌ ఆర్‌.శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏడీ దామెదర్‌రెడ్డి, డీఆర్‌డీవో రాము తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...