చిన్నతరహా, సాగునీటి వనరుల


Thu,May 16, 2019 03:15 AM

-గణనను సకాలంలో పూర్తి చేయాలి
-జిల్లా రెవెన్యూ అధికారి మోహన్‌లాల్‌
రెడ్డికాలనీ, మే 15: చిన్నతరహా, సాగునీటి వనరుల గణన జలాశయాల గణన సకాలంలో పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్‌లాల్‌ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో 6వ చిన్న తరహా సాగునీటి వనరుల గణన, జలాశయాల గణన 2017-18గాను అమలు చేసే విధివిధానాలపై జిల్లాస్థాయి సమావేశం ముఖ్యప్రణాళికాధికారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యప్రణాళికాధికారి జెడ్‌ రాందాస్‌ మాట్లాడుతూ గణనలో భాగంగా జిల్లాలో భూగర్భ, ఉపరితల సాగునీటి పథకాలు ఎన్ని ఉన్నాయో ఈ సంవత్సరం(2018-19) లెక్కింపు జరుగుతుందని, జిల్లాలోని చిన్న నీటి వనరుల ఉనికి, వాటిలో నీటి లభ్యత వంటి సమాచారం సేకరించడం, చిన్న నీటి వనరుల గణనతో పాటు జలాశయాల గణనను 2017-18 ప్రామాణిక సంవత్సరంగా మొదటిసారిగా చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ గణన ప్రక్రియలో 2000 హెక్టార్లు లేదా అంతకంటే తక్కువ భూమికి సాగునీరు అందించే నీటివనరులపై పక్కా సమాచార సేకరణ, మండల స్థాయిలో ఈ బాధ్యత తహసీల్దార్లు, గ్రామస్థాయిలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు, జలాశయాల గణన నిర్వహించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన గ్రామస్థాయి అధికారి ఈ సమాచారాన్ని సేకరిస్తారు. కార్యక్రమంలో ముఖ్యప్రణాళికాధికారి కార్యాలయ గణాంకాధికారి, ఉప గణాంకాధికారులు, మండల ప్రణాళికా గణాంకాధికారులు, జిల్లా నీటిపారుదల శాఖాధికారి, ఎస్‌ఈ ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్‌, భూగర్భ జల శాఖాధికారి, ఎక్స్‌క్యూటీవ్‌ ఇంజినీర్‌, టీఎస్‌ఐడీసీ, మున్సిపల్‌, గ్రామీణాభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...