భారీ మెజార్టీతో గెలిపించాలి


Fri,April 26, 2019 01:37 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 25: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, డీఎస్ రెడ్యానాయక్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్, ఎంపీ సీతారాంనాయక్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 16 పార్లమెంట్ స్థానాలకు పదహారు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రావన్నారు. ప్రజలకు అవినీతి లేని పాలన అందించేందుకు, కేసీఆర్ చాలా మార్పులు తీసుకోస్తున్నారన్నారు. పంచాయతీరాజ్ చట్టం, విద్యావిధానం, రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చేస్తున్నామని అన్నారు. కేంద్రంలో కొన్ని నిబంధనల ప్రకారం కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను నీరుగార్చారని అన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు, జిల్లా , మండల పరిషత్‌ల ద్వారా అభివృద్ధి చేసుకునేలా సీఎం ప్రణాళికలు తయారు చేశారన్నారు. అధికారులు లేక గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇనుగుర్తిని మండ లం చేసుకుంటాం. ముఖ్యమంత్రి మాట ఇచ్చారు కనుక తప్పక చేస్తారని అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజ్ వంటి హామీలను నేరవేర్చుతామన్నారు. ఎస్సారెస్పీ కాల్వలు ఏర్పాటు చేసి 30 ఏండ్లు అయింది. అవి పూర్తిగా పాడయ్యాయి.

కాల్వల పునర్నిర్మాణాన్ని జూన్‌లోగా చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు. జూన్ చివరికి కాల్వల ద్వారా ప్రతీ చెరువులో కాళేశ్వరం నీల్లు వచ్చి చేరుతాయన్నారు. మూడేళ్లలో 70 ఏండ్లు కరువు పోతోందంటే అది సీఎం కేసీఆర్ మానుకోటకు ఇచ్చిన పెద్దవరం అన్నారు. అందుకే అన్ని స్థానాలు గెలిస్తే మహబూబాబాద్ జిల్లాను కోనసీమగా మార్చుకుందామన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో నీటి సమస్యలు లేకుండా పోయిందన్నారు. డిసెంబర్ నాటి కల్లా పూర్తిస్థాయిలో పనులు పూర్తవుతాయన్నారు. గ్రామగ్రామాన బీటీ రోడ్లు వేయడానికి, నూతన పంచాయతీ భవన నిర్మాణానికి మూడు వేల కోట్లు కేటాయించినటట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలంతా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటాం, ఐదు వేల నామినేటెడ్ పోస్టులున్నాయి. సీనియర్ నాయకులకు ఈ పోస్టుల్లో తప్పకుండా అవకాశం కలిపిస్తామన్నారు. ఇంటర్ ఫలితాలపై సీఎం సీరియస్‌గా ఉన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టే కార్యకలాపాలు చేయొద్దని అన్నారు. ఇంటర్ వ్యవస్థను పరిశీలించి సీఎం తదుపరి చర్యలు తీసుకోనున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, భరత్‌కుమార్‌రెడ్డి, బాలాజీనాయక్, నెహ్రురెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, బండి వెంకట్‌రెడ్డి, తేల్ల శ్రీనివాస్, చిట్యా ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటేలా వ్యూహంతో పని చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యేలకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, డీఎస్ రెడ్యానాయక్, హరిప్రియ, ముఖ్యనాయకులతో సమావేశమై స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పేద ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లాలో ఉన్న 16 జెడ్పీటీసీలను గెలుపొంది జెడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 198 ఎంపీటీసీలను గెలిచి, 16 ఎంపీపీలను కైవసం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలోనూ తొం దర పడకుండా జాగ్రత్తలు వహించాలని, పార్టీలో, ప్రజల్లో మంచి పేరు, పలుకుబడి, గెలిచే సమర్థత ఉన్న వారికే టికె ట్లు కేటాయించాలన్నారు. ఆశావహుల్లో అసంతృప్తి లేకుం డా చూడాలని, పార్టీని నమ్ముకొని, కష్టపడి పని చేసే వారికి తగిన సమయంలో గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని వివరించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. మండల, గ్రామస్థాయి నాయకులు సమన్వయంతో పని చేసేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావాలని, ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు కలిసి పని చేయాలని సూచించారు. సమావేశం లో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు భరత్‌కుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మార్నేని వెంకన్న, మం డల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, మర్రి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...