ముగిసిన సీసీఐఎం బృందంతనిఖీలు


Wed,April 24, 2019 03:25 AM

వరంగల్ చౌరస్తా/ మిల్స్‌కాలనీ, ఏప్రిల్ 23: ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాలలో మంగళవారం సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ (సీసీఐఎం) బృందం రెండో రోజు తనిఖీలు నిర్వహించి, ముగించారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద బోధనా కళాశాల, వైద్యశాలల్లో రానున్న విద్యాసంవత్పరం బీఏఎంఎస్ విద్యావిధానానికి అవసరమైన మౌలిక వసతులు, తరగతి గదులు, హెర్బల్ గార్డెన్ వసతి గృహాలను పరిశీలించారు. వైద్యవిద్యార్ధులకు బోధనా వివరాలను పరిశీలించేందుకు అవసరమైనంత రోగుల వసతుల గూర్చి తెలుసుకున్నారు. మంగళవారంతో తనిఖీలు ముగిసినట్లు వారు తెలిపారు. తనిఖీల ఆధారంగా నివేదిక రూపొందించి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో బెంగుళూరు ఆయుర్వేద వైద్యకళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శివానంద గణాచారి, హైదరాబాద్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ప్రొఫెసర్ డాక్టర్ వీ నరసింహ, అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద బోధనా వైద్యశాల సూపరింటెండెంట్ విజయ్‌పాల్ రెడ్డి, అనంతరలక్ష్మి వైద్య కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్‌బాబు, డాక్టర్ సిరాజుద్దీన్, డాక్టర్ అశోక్‌కుమార్, డాక్టర్ అనసూయ, డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ మాయ, డాక్టర్ దుర్గాదేవి, వైద్యశాల, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...