మొదటి దశ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్


Wed,April 24, 2019 03:24 AM

అర్బన్ కలెక్టరేట్/సుబేదారి, ఏప్రిల్ 23 : మే 6న మొదటి దశ స్థానిక సంస్థల పోలింగ్ విధులు నిర్వహించే 1927 మంది సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా నియమించినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జనరల్ అబ్జర్వర్ బి.శ్రీనివాస్ సమక్షంలో ర్యాండమైజేషన్ ద్వారా ఉద్యోగుల డాటాబేస్ నుంచి పోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. 400 లోపు ఓటర్లు ఉన్న 32 పోలింగ్ కేంద్రాల్లో ఐదుగురి చొప్పున, 400 పైబడి ఓటర్లు ఉన్న 241 పోలింగ్ కేంద్రాల్లో ఆరుగురు చొప్పున పోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీరికి ఈ నెల 27న పోలింగ్ శిక్షణ ఇవ్వనున్నుట్ల కలెక్టర్ చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా పోలింగ్ పార్టీలకు ఉత్తర్వులు పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా మండల కేంద్రాల్లో శిక్షణకు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బీ సంతోష్, జెడ్పీ సీఈవో ఎం విజయ్‌గోపాల్, డీఈవో నారాయణరెడ్డి, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...