టీఆర్‌ఎస్‌లోకి గండ్ర


Tue,April 23, 2019 02:37 AM

(జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ) సస్పెన్స్‌కు గండ్ర ఫుల్‌స్టాప్ పెట్టారు. కాం గ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిశా రు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరాలని ని ర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తన నిర్ణ యం వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని కోరారు. ఈ మేరకు లేఖ విడుదల చేశా రు. సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారు. స్థా నిక సంస్థల ఎమ్మెల్సీగానూ గండ్ర పని చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. తొలి పోరులోనే విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వంలో కీలకపాత్ర వహించారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పని చేశారు. భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధిపై ప్రభుత్వ చీఫ్‌విప్‌గా తనదైన ముద్ర వేశారు. 2014ఎన్నికల్లో ఓడిపోయి గండ్ర 2018 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరిగి భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. సౌమ్యుడిగా ప్రజల మన్ననలు అందుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వెంకటరమణారెడ్డి కీలక వ్యక్తిగా ఎదిగారు. కొద్దిరోజుల నుంచి గండ్ర కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం తెర పైకి వచ్చింది. జిల్లా అభివృద్ధి కోసం వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే దిశలోనే అడుగులు వేశారు. అందరూ ఊహించినట్లుగానే గండ్ర కాంగ్రెస్‌ను వీడారు.

సోమవారం రాత్రి తన భార్య గండ్ర జ్యోతితో హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం వెంకటరమణారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు, భూపాలపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం తాను కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఎవరికైనా తన నిర్ణయం వల్ల బాధ కలిగితే క్షమించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భార్య గండ్ర జ్యోతి కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించారు. మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా పని చేశారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తున్న ఆమె వరంగల్ మహానగర పాలక సంస్థ కార్పొరేటర్‌గానూ వ్యవహరించారు. కార్పొరేటర్‌గా గండ్ర జ్యోతి వరంగల్ మహా నగరంలో రాజకీయంగా తన ప్రత్యేకత చాటారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఆమె కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజినామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యో తి దంపతుల చేరికతో టీఆర్‌ఎస్ మరింత బలోపే తం కానుంది.

గండ్ర లేఖ
భూపాలపల్లి జిల్లా తరలిపోతుందనే అపోహలను పటాపంచలు చేయడానికి, జిల్లా సమగ్రాభివృద్ధికి, సింగరేణి కార్మికుల ఆకాంక్షలను సాకారం చేయడానికి, జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలుపడానికి కేసీఆర్‌తో కలిసి పని చేయడానికి నిర్ణయించుకున్నా. సీఎంగా కేసీఆర్ పాలనను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రణాళికా బద్ధంగా చిత్తశుద్ధితో పనిచేస్తునారు. అందుకు తెలంగాణ ప్రజలు రెండోసారి అధికారం ఇచ్చారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం ప్రజాప్రతినిధిగా నావిధి. నియోజకవర్గ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటా. ఎన్నికల సందర్భంగా ఔటర్ రింగ్‌రోడ్డు, మెడికల్ కాలేజీ సాధిస్తానని చెప్పా. నా మాటకు కట్టుబడి ఉన్నా. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అలాగే, నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేయించడం నా బాధ్యత. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వీటిని పూర్తి చేస్తా. టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై నాకు అచంచమైన నమ్మకం ఉంది. తెలంగాణను సాధించి అభివృద్ధిలో నంబర్ వన్‌గా నిలుపుతున్న సీఎం కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నా. అవసరమనుకుంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నిటికీ రాజీనామా చేయడానికి కూడా సిద్ధమే. అతి త్వరలోనే టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా. అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీలో చేరడానికి ముందు విడుదల చేసిన లేఖలో ప్రస్తావించారు.
133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...