కేఎంసీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు సీఎం కేసీఆర్


Tue,April 23, 2019 02:35 AM

పోచమ్మమైదాన్, ఏప్రిల్ 22: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల డైమండ్ జూబ్లీ (వజ్రోత్సవాలు) ముగింపు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రానున్నారు. కళాశాలలో ఏడాది పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం జూలై 20, 21 తేదీల్లో ముగింపు సమావేశం నిర్వహించనున్నారు. 20న తొలిరోజు జరుగు ప్రారంభ సమావేశంలో సీఎం కేసీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. సీఎంతో పాటు వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్ననట్లు తెలుస్తోంది. కాగా ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతున్నట్లు అధి కారులు గతంలో ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 23న హైద రాబాద్‌కు విచ్చేసిన రాష్ట్ర పతిని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య కలిసి డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ఆహ్వా నించినపుడు ఆ యన అంగీకరించారు. ప్రస్తుతం కొన సాగుతున్న లోకసభ ఎన్నికల ప్రక్రియతో పాటు రానున్న కాలంలో కేం ద్రంలో కొలు వు తీరనున్న నూతన ప్ర భుత్వం నేప థ్యం లో రాష్ట్ర ప తి పర్యటన రద్దు అయినట్లు సమా చారం. ఈ మేరకు రాష్ట్రపతి కా ర్యాల యం నుంచి వ రంగల్ పర్యటన రద్దుపై అధికారు లకు లేఖ అంది నట్లు తెలుస్తుంది.


నామినేషన్ల ప్రక్రియ ఆరంభం
సుబేదారి, ఏప్రిల్ 22: జిల్లాలో మొదటి విడత జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. జిల్లాలోని 7 మండలాలకు తొలి దఫాగా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హసన్‌పర్తి, కమలాపూర్ మండలాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు జెడ్పీటీసీ స్థానాలకు తొలిరోజున 2 నామినేషన్లు దాఖలయ్యాయి. భీమదేవరపల్లి జెడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎ నుంచి నామినేషన్ దాఖలైంది. కమలాపూర్ జెడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ వేశారు. ఇక ఎంపీటీసీ స్థానాలకు 23 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో భీమదేవరపల్లి మండలంలోని 13 స్థానాలకు 5 నామినేషన్లు దాఖలు కాగా.ఇందులో ఐదు టీఆర్‌ఎస్ అభ్యర్థులే. ఎల్కతుర్తి మండంలో 12 స్థానాలకు 4 నామినేషన్లు వేశారు. వీటిలో ఒకటి టీఆర్‌ఎస్, రెండు కాంగ్రెస్, ఒకటి ఇండిపెండెంట్, హసన్‌పర్తి మండలంలో 9 స్థానాలకు 6 దాఖలు కాగా.. వీటిలో 6 టీఆర్‌ఎస్. కమలాపూర్ మండలంలో 18 స్థానాలకు 8మంది నామినేషన్లు వేయగా.. 3 టీఆర్‌ఎస్, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు ఉన్నారు.

భీమదేవరపల్లి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలివిడత ఎన్నికల్లో భాగంగా సోమవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆరంభమైంది. మండల పరిషత్‌లో ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. జెడ్పీటీసీ స్థానానికి తొలిరోజున మాడిశెట్టి కుమారస్వామి(టీఆర్‌ఎస్) నామినేషన్ దాఖలు చేశారు. భీమదేవరపల్లి మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలుండగా ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ములుకనూరు-1 ఎంపీటీసీ స్థానం నుంచి బొల్లంపల్లి రమేశ్, కొత్తపల్లి నుంచి మండల సురేశ్, గట్లనర్సింగాపూర్ నుంచి పోల్నేని విజయ, రత్నగిరి ఎంపీటీసీ స్థానం నుంచి హిమాముద్దీన్, కొత్తకొండ నుంచి యాటపోలు విజయ నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవీ దేవకీదేవి తెలిపారు.

ఎల్కతుర్తి: మండలంలో ఎంపీటీసీ స్థానాలకు 4 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో ఇందుమతి తెలిపారు. దామెర-1, దామెర-2, , తిమ్మాపూర్, కేశవాపూర్ నుంచి ఒక్కొక్క నామినేషన్ చొప్పున మొత్తం అభ్యర్థులు దాఖలు చేశారు.

కమలాపూర్: మండల పరిషత్ కార్యాలయంలో తొలిరోజు ఎంపీటీసీ , జెడ్పీటీసీ స్థానాలకు 9 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో రవిబాబు సోమవారం తెలిపారు. మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కమలాపూర్ -1 స్థానానికి గొట్టె మంజుల స్వతంత్ర, గుండేడు నాంపల్లి తిరుమల స్వతంత్ర, వంగపల్లి కొండపాక మధుసూదన్ స్వతంత్ర, శనిగరం తడుక రాణి టీఆర్‌ఎస్, మాధన్నపేట కత్తి రమేశ్ టీఆర్‌ఎస్, శ్రీరాంలపల్లి ఇంజపూరి ఉమ టీఆర్‌ఎస్, శ్రీరాంలపల్లి గడ్డం లక్ష్మి స్వతంత్ర, అంబాల కెత్తె రవి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జెడ్పీటీసీ స్థానానికి శనిగరం గ్రామానికి చెందిన తడుక రాణి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు ఎంపీడీవో తెలిపారు.

హసన్‌పర్తి: మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాలకు సోమవారం మొదటి రోజు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో వీరేశ్ తెలిపారు. అనంతసాగర్ నుంచి ముగ్గురు అభ్యర్థులు బండ రత్నాకర్‌రెడ్డి, బూరుగుపల్లి విజయ్‌కుమార్, మొట్టె రాజు, నాగారం నుంచి గౌరు సుమతిరెడ్డి, సిద్దాపూర్ నుంచి బాల్నే రామనాథం, జయగిరి నుంచి పల్లె కవిత నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...