ప్రణాళికలు అమలయ్యేనా..


Mon,April 22, 2019 03:08 AM

-నగరంలో తాగునీటికి కట..కట
-400లకుపైగా లీకేజీలు
-రోజుకు 25 ఎంఎల్‌డీల నీరు రోడ్డుపాలు
వరంగల్, నమస్తేతెలంగాణ: వేసవి కాలంలో తాగునీటి కష్టా లు తలెత్తకుండా బల్దియా అధికారుల ప్రణాళికలు ముందుకు పోయేనా? గత అనుభవాలను పరిశీలిస్తే ఇది ఆరంభ శూరత్వ మే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, అదేస్థాయిలో కార్యాచరణ ఉంటేనే సత్ఫలితాలు ఇస్తాయన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ దిశలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప క్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

విలీన గ్రామాల్లో ఇబ్బందులు
రాబోయే రోజుల్లో ఎండలు దంచి కొడుతాయని వాతావర ణశాఖ ముందస్తు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో తాగనీటి కష్టాలు ఈ ఏడాది ఎక్కువయ్యేలా కనిసిస్తున్నా యి. ముఖ్యంగా విలీన గ్రామాల్లో ఇప్పటి నుంచే తాగునీటికి ప్ర జలు తండ్లాడుతున్నారు. ఒక్కో గ్రామంలో కనీసం 10 రోజులకు కూడా తాగునీరు సరఫరా కావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అయితే బల్దియా అధికారులు ముందస్తుగా విలీన గ్రామాల తాగునీటి తిప్పలు తీర్చేలా వేసవి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. మే 15 వరకు తాగునీటికి ఢోకా లేదని చెప్పుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు వి రుద్ధ్దంగా కనిసిస్తున్నాయి.

నగర జలాశయాల్లో ఉన్న నీటి నిల్వ ల ఆదారంగా ప్రతి ఏడాది బల్దియా ఇంజినీరింగ్ అధికారులు వేస్తున్న అంచనాలు తప్పుతున్నాయి. దీనికి తోడు నగరంలోని లీకేజీలు కలవరపెడుతున్నాయి. ఇవి వేసవిలో తాగునీటి కష్టాలను మరింత తీవ్రతరం చేయనున్నాయి. నగర పరిధిలో 430 పైగా లీకేజీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్పుతున్నాయి. ఇం దులో 50కి పైగా లీకేజీలు పెద్దవిగా ఉన్నాయి. వీటితోపా టు వం దల సంఖ్యలో ఉన్న చిన్న చిన్న లీకేజీలతో పెద్దఎ త్తున తాగునీరు వృథా అవుతోంది. ప్రతి రోజు నగర ప్రజలకు తాగునీటి కోసం సరఫరా చేసే 150 ఎంఎల్‌డీ నీటిలో 20 నుంచి 25 ఎల్‌ఎండీ నీరు రోడ్డు పాలవుతున్నట్లు అధికారులు అంచనా వే స్తున్నారు. ఇంత పెద్దఎత్తున తాగునీరు లీకేజీల ద్వారా వృథా అవుతుండటంలో వేసవిలో ప్రజలకు తాగునీటి కష్టాల తప్పవన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్‌లోని పలు ప్రాంతాలతోపాటు విలీన గ్రామాలలో తా గునీటి కటకట మొదలయింది. నగరంలో రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ అనేక ప్రాంతాలలో షెడ్యూల్ ప్రకారం సరఫరా కావడం లేదు. కొన్ని గ్రామాలలో పది రోజులకు కూడా నీరు సరఫరా కావడంలేదు. ఇప్పటికే విలీ న గ్రామాల కార్పొరేటర్లు తాగునీటి కష్టాలపై ఆవేదన చెందుతున్నారు. కనీసం గ్రామాల ప్రజలకు తాగునీరు అందించలేక పో తున్నామని మదనపడుతున్నారు. కార్పొరేషన్‌లో విలీనమైనటి నుంచి విలీన గ్రామాల్లో రక్షిత తాగునీటిని సరిగా బల్దియా సరఫరా చేయలేకపోతున్నది. గ్రామాలలో బావులు, బోర్లపై అదారపడుతున్నారు. వేసవికాలంలో అధికారులు విలీన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

గ్రామాలలో మం జూరు అయిన బోర్లు వేసే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు గ్రామాలలో తాగునీటికి అనుగుణంగా ఉన్న బావులను లీజుకు తీసుకోవడం, వాటిని పూడిక తీయడం లాంటి పనులు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉంది. అయితే అధికారులు ఆ దిశలో దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నగర శివారున ఉన్న అనేక గ్రామాలకు పది రోజులకు ఒకసారి కూడా తాగునీరు సరఫరా కావడంలేదు. ప్రతి గ్రీవెన్స్‌లో అనేక వినతులు వస్తుండటమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా అధికారులు తా గునీటి కష్టాలు తీర్చేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించడం కాదు క్షేత్రస్థాయిలో వాటిని పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

లీకేజీల పరంపర
తాగునీటి కష్టాలకు నగరంలోని లీకేజీలు తోడవుతున్నాయి. నగర పరిధిలో సుమారు 430పైగా లీకేజీలు ఉన్నట్లు అధికారు లు చెప్పుతున్నారు. ప్రతి ఏడాది లీకేజీలపై మహా నగరపాలక సంస్థ లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా నగరంలో లీకేజీ పరంపర కొనసాగుతోంది. వందల సంఖ్యలో ఉన్న లీకేజీలను అధికారులు పట్టించుకోవడం లేదు. అనేకసార్లు వరుసగా లీకేజీలపై ప్రజలు ఫిర్యాదులు చేసినా వాటివైపు కన్నెత్తి చూ డటం లేదు. తాగునీరు రోజూ వరదలై పారుతున్నాయి. నగరంలో 50కిపైగా ఉన్న పెద్ద లీకేజీల నుండి తాగునీరు వరదలా పారుతుండటం నిత్యం కనిపిస్తోంది. పెద్ద లీకేజీలు ఏడాది పొ డువునా కనిపిస్తూనే ఉంటున్నాయి. ఇప్పటికైనా లీకేజీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెడితేనే వేసవిలో తాగునీరు వృథా కా కుండా ఉంటుంది. లీకేజీల మరమ్మతులో సాంకేతిక పరిజ్ఞానా న్ని వినియోగించుకోలన్న వాదనలు వినవస్తున్నాయి. వేసవి కా లం వచ్చిందంటే చాలు హడావుడిగా టెండర్లు పిలిచి లీకేజీలను తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. లక్షలు వెచ్చించి ప్రతి ఏడాది లీకేజీల మరమ్మతులు చేస్తున్నా మళ్ళీమళ్ళీ లీకేజీలు కావడంపై సమస్య మొదటికి వస్తోంది.

వృథాగా తాగునీరు
నగరంలో లీకేజీల ద్వారా ప్రతి రోజు పెద్ద ఎత్తున తాగునీరు వృథా అవుతోంది. రోజు సరఫరా అయ్యే 150 ఎంఎల్‌డీ తాగునీటిలో 25 ఎంఎల్‌డీ తాగునీరు లీకేజీలతో రోడ్డు పాలవుతున్నాయి. లీకేజీలతో రోడ్డుపాలు అవుతున్న తాగునీరు ప్రతి రోజు నగరంలో సరఫరా చేసే తాగునీటిలో పావు వంతు అన్న మాట. వేసవి కాలంలో అసలే నీటి కష్టాలు ఉండే నేపథ్యంలో లీకేజీల తో పెద్ద ఎత్తున తాగునీటి వృథాతో కష్టాలు మరింత తీవ్రం కా నున్నాయి. వేసవి కాలం ముందే నగరంలోని లీకేజీల మరమ్మతులను యుద్ధ్దప్రాతిపధికన మరమ్మతులు చేపట్టాలి. అయితే కమిషనర్ నాలుగు రోజుల ముందు తాగునీటి సరఫరాపై సమీ క్షా నిర్వహించి 48 గంటలలో లీకేజీల మరమ్మతు చేయాలని ఆదేశించారు. అయితే అధికారులు ఇప్పటి వరకు ఆ దిశలో చ ర్యలు తీసుకోలేదు. రోడ్డు పాలవుతున్న తాగునీటిని సద్వినియో గం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్దఎత్తున లీకేజీల ద్వారా తాగునీరు వృథా అవుతుంటే అధికారులు మాత్రం ప ట్టించుకోవడంలేదు. వేసవిలో నగర ప్రజలు తాగునీటి గండం నుంచి గట్టెక్కాలంటే అధికారులు వెంటనే లీకేజీల మరమ్మతులపై దృష్టి సారించాలి. లేకుంటే మళ్లీ వేసవిలో తాగునీటి తి ప్పలు తప్పవు.

270
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...