మానవత్వం చాటుకున్న ఇంతెజార్‌గంజ్ పోలీసులు


Mon,April 22, 2019 03:07 AM

-చావుబతుకుల్లో ఉన్న వృద్ధుడిని కాపాడిన వైనం
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 21: సుమారు నెల రోజులుగా తలుపులు బిగించుకొని ఇంట్లోనే నీళ్లు తాగి జీవిస్తున్న వృద్ధ్దుడిని ఇంతెజార్‌గంజ్ పోలీసులు దవాఖానకు తరలించారు. పోలీసులు కథనం ప్రకారం .. చార్‌భౌళి ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉ ద్యోగి అల్లంపల్లి వెంకట్రామనర్సయ్య చాలా యేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ యనకు ఇద్దరు కుమారులు కాగా ఒకరు ఇతర విదేశాల్లో స్థ్దిరపడగా, మరో కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సుమారు నెల రోజుల నుంచి వెంకట్రామనర్సయ్య ఇం ట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ శ్రీధర్ ఆదేశానుసారం వెంకట్రామనర్సయ్య ఇంటికి చేరుకు న్న పోలీసులు తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్లి చూడగా వెంకట్రామనర్సయ్య కదలలేని స్థితిలో ప్రాణాలతో కనిపించాడు. తాను 21 రోజులుగా మంచి నీరు తాగి జీవిస్తున్నానని బాధితుడు తెలిపాడు. వెంటనే ప్రథమ చికిత్స అందించి, హైదరాబాద్‌లోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సహకారంతో కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. వెంకట్రామనర్సయ్యకు ప్రథమ చికిత్స అందజేసి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థ్ధానికులు అభినందిచారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడడంతో చురుకైన పాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ రాంచందర్, ఖాజా నిజాముద్దీన్, సాంబశివుడు, హోంగార్డు రాజును ఇంతెజార్‌గంజ్ సీఐ శ్రీధర్, ఉన్నతాధికారులు అభినందించారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...