సమ్మక్క-సారలమ్మమహాజాతర తేదీలు ఖరారు


Mon,April 22, 2019 03:06 AM

తాడ్వాయి, ఏప్రిల్ 21 : ఆదివాసీ గిరిజన దైవం అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలను ఆదివారం సమ్మక్క-సారలమ్మ పూ జారులు ఖరారు చేశారు. ఈమేరకు వనదేవతల గద్దెల ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధ్దబోయిన జగ్గారావు అధ్వర్యంలో అమ్మవార్ల పూజారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల మహాజాతర జరిగే తేదీలపై పూజారులు చర్చించుకున్న అనంతరం 2020 ఫిబ్రవరి మాసంలో మాఘశుద్ధ్ద పౌర్ణమిని పురస్కరించుకుని ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అమ్మవార్ల మహాజాతరను నిర్వహించేందుకు పూజారులు నిర్ణయించారు. 5న సారలమ్మ దేవత, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుట, 6న సమ్మక్క దేవత చిలకలగుట్ట నుంచి గద్దెపై కొలువుదీరుట, 7న అమ్మవార్ల గద్దెలకు భక్తుల మొక్కులు, 8న వనదేవతల వనప్రవేశం కార్యక్రమాలు నిర్వహించుటకు పూజారులు నిర్ణయించారు. మహాజాతర విజయవంతం అయ్యేందుకు గాను పూజారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చేసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, తల్లులు గద్దెలపైకి చేరుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, పూజారులకు, వీక్షించే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు పూజారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకున్నారు. కార్యక్రమంలో పూజారులు సిద్దబోయిన మునీందర్, మహేష్, లక్ష్మణ్‌రావు, కొక్కెర క్రిష్ణయ్య, చందా బాబురావు, కాక సారయ్య, కిరణ్‌కుమార్, కనకమ్మ, లక్ష్మి బాయమ్మ, భుజంగరా వు, కాక వెంకటేశ్వర్లులతో పాటు పూ జారుల కుటుంబ సభ్యులు గోపాల్‌రావు, బోజరావు, అనిల్, స్వామి, వ సంతరావు, సురేందర్ పాల్గొన్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...