ప్రశాంతంగా ముగిసిన ఎస్సై రాత పరీక్ష


Mon,April 22, 2019 03:05 AM

-ఎండ తీవ్రత నుంచి రక్షణకు పరీక్ష కేంద్రాల్లో వైద్యశిబిరాలు
-11,855 అభ్యర్థులకు 696 మంది గైర్హాజరు
-పరీక్ష కేంద్రాలను సందర్శించిన సీపీ
వరంగల్ క్రైం, ఏప్రిల్ 21 : సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం రెండో రోజు ఆదివారం నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 11,885 అభ్యర్థులకు 11,212 మంది హాజరు కాగా 696 మంది గైర్హాజరయ్యారు. నగరంలోని 7 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా వీరి కోసం బస్టాండ్, రైల్వేస్టేషన్‌ల నుంచి అదనంగా ఆర్టీసీ బస్సులను కేటాయించారు. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల అడ్రస్ తెలియజేయడానికి ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. కొన్ని పరీక్ష కేంద్రాల వద్ద స్థానిక ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు.
పరీక్ష కేంద్రాల్లో వైద్య శిబిరం ఏర్పాటు
ఉదయం, మధ్యాహ్నం రెండు పూటల పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థులకు ఎండదెబ్బ తగిలి ఇబ్బందులకు గురికాకుండా జిల్లా వైద్యశాఖ సహకారంతో ఆయా పరీక్ష కేంద్రాల్లో సీపీ రవీందర్ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయించారు. ఆకస్మాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తితే ప్రధమ చికిత్స అందించడానికి పరీక్ష కేంద్రానికి ఇద్దరు చొప్పున వైద్యసిబ్బందిని ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు వైద్యసిబ్బంది అందించిన వైద్యసేవలతో పాటు వైద్య బృందాల పనితీరు గురించి వైద్యబృందాలను సీపీ అడిగి తెలుసుకున్నారు.

పరీక్ష కేంద్రాలనుసందర్శించిన సీపీ
వరంగల్‌లోని ఎల్‌బీ కళాశాలతో పాటు, ఎస్.వీ.ఎన్ రోడ్డులోని ఏవీవీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్ష హాల్స్‌లోకి వెళ్లి బయోమెట్రిక్ విధానం, ఇన్విజిలేటర్ విధులను గమనించారు. సీపీ వెంట పోలీస్ నోడల్ అధికారి వెస్ట్‌జోన్, ఈస్ట్‌జోన్ డీసీపీలు శ్రీనివాస్‌రెడ్డి, కెఆర్.నాగరాజు, వరంగల్ ఏసీపీ నర్సయ్య, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ జీవన్‌రెడ్డి ఉన్నారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...