వరంగల్ హౌసింగ్ సొసైటీకి ప్రత్యేక గుర్తింపు


Mon,April 22, 2019 03:05 AM

-ఉద్యోగుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా..
-ఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి
-సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉద్యోగులు : పరిటాల సుబ్బారావు
రెడ్డికాలనీ, ఏప్రిల్ 21: తెలంగాణలోనే వరంగల్ హౌసింగ్ సొసైటీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద నుంచి సెంటు భూమి కూడా తీసుకోలేదని ఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. ఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ సమావేశం హన్మకొండలోని టీఎన్జీవోస్ భవన్‌లో ఆదివారం హన్మకొండ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా రవీందర్‌రెడ్డి, జాక్ ఛైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కోలా రాజేష్‌కుమార్, టీజీవోస్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగన్మోహన్‌రావు హాజరయ్యారు. అనంతరం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో తీసుకున్న ప్రైవేటు భూముల్లో కొన్ని ప్లాట్లు కబ్జాలకు గురి అవుతున్నాయని అంటూ వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పలివేల్పుల్లో హౌసింగ్ సొసైటీ కార్యాలయ నిర్మాణానికి సహకారం అందిస్తామని, హౌసింగ్ సొసైటీ కడిపికొండ భూమి విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు.

దానికి సంబంధించిన పనులను జూన్ తర్వాత వేగవంతం చేస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కూడా ఉద్యోగులకు స్థలాలు కేటాయించే విషయం గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులందరికీ స్థలాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ముఖ్యంగా పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపు వాటిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని, రెవెన్యూ శాఖపై వస్తున్న వదంతులను సీఎం దృష్టికి తీసుకెళ్లి వారి మనోభావాలను వివరిస్తామన్నారు. జాక్ ఛైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉద్యోగులు పనిచేస్తున్నారని వారిని ఒప్పించి, మెప్పించి సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. లోపాలను సవరించుకుని ప్రజలకు ఉపయోగపడే సంస్కరణలను స్వాగతిస్తామన్నారు. తెలంగాణ సాధనలో వారితో అడుగులో అడుగు వేసి నడిచామని, బంగారు తెలంగాణ సాధనలో కూడా వారితో నడుస్తామన్నారు. అలాగే కడిపికొండ స్థలానికి సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరించి ప్లాట్లను అర్హులైన ఉద్యోగులకు అందిస్తామని అన్నా రు.

కొత్త జిల్లాలో కూ డా ఉద్యోగులకు ప్లా ట్స్ కృషి చేస్తామన్నారు. టీఎన్జీవోస్ కో ఆర్డినేటర్ కోలా రాజేష్‌కుమార్ గౌడ్ మా ట్లాడుతూ వరంగల్ జిల్లా ఆరు జిల్లాలుగా విడిపోవడంతో ఉద్యోగులపై విపరీతమైన పని ఒత్తిడి పెరిగిందని, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు రవీందర్‌రెడ్డి ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. టీఎన్‌జీవోస్ కోఆర్డినేటర్ జగన్మోహన్‌రావు మాట్లాడుతూ వరంగల్ జిల్లా హౌసింగ్ సొసైటీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, గతంలో సహకార శాఖ ద్వారా ఉత్తమ హౌసింగ్ సొసైటీ అవార్డు కూడా తీసుకోవడం జరిగిందన్నారు. సమావేశంలో హౌసింగ్ సొసైటీ కోశాధికారి పుల్లూరు వేణుగోపాల్, కార్యదర్శి రత్నాకర్‌రెడ్డి, డైరెక్టర్లు అచ్చ సదానందం, అమ్జద్‌అలీ, రత్నవీరాచారి, శ్యాంసుందర్, ఇబ్రహీం హుస్సేన్, అశోక్‌లతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు రాజ్‌కుమార్, బైరి సోమయ్య, కత్తి రమేశ్, రామునాయక్, గజ్జెల రాంకిషన్, బి.రవి,కిషన్‌రావు, చీకటి శ్రీనివాస్, కిరణ్‌రెడ్డి, నాగసాగర్, రఘుపతిరెడ్డి, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.

171
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...