24న తిరునక్షత్ర మహోత్సవం


Mon,April 22, 2019 03:03 AM

ఖిలావరంగల్, ఏప్రిల్ 21: సత్సంప్రదాయ పరిరక్షణ సభ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న శ్రీమాన్ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి 94వ తిరునక్షత్ర మహోత్సవాన్ని హంటర్ రోడ్డులోని కోడం కన్వెన్షన్ ఏసీ హాల్‌లో నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షకార్యదర్శులు ఏ వరదారెడ్డి, సముద్రాల శఠగోపాచార్యులు తెలిపారు. సభ అధ్యక్షుడు సముద్రాల పురుషోత్తమచార్యస్వామి అధ్యక్షతన జరిగే శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కార సభలో శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, శ్రీ రామచంద్రజీయర్‌స్వామి, శ్రీ అష్టాక్షరి జీయర్ స్వామి పాల్గొని భక్తులకు అనుగ్రహభాషణ చేస్తారని చెప్పారు. అలాగే సభకు ముఖ్య అతిథిగా శాస్త్రరత్నాకర, ఉభయ వేదాంతాచర్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌వీ రంగరామానుజాచార్యస్వామి పాల్గొంటారని తెలిపారు. తమిళనాడు కంచి పుణ్యక్షేత్రానికి చెందిన సంప్రదాయ పండితుడు శ్రీమాన్ ప్రతివాది భయంకరం రాజహంస్వామికి రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఆచార్య నరసింహాచార్యుల వారికి శ్రీ రఘునాథదేశిక విశిష్ట పురస్కారాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు ద్రావిడ ప్రభంద పారాయణం అనంతరం శ్రీ రఘునాథాచార్యస్వామి చిత్రపటానికి అష్టోత్తర శతనామార్చన, శ్రీ రఘునాథ వింశతి స్తోత్రాన్ని భక్తులు సామూహికంగా పారాయణం చేస్తారని తెలిపారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...