ఆకట్టుకున్న పేరిణి నృత్య ప్రదర్శన


Mon,April 22, 2019 03:03 AM

ములుగుటౌన్: రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని రామాలయం సమీపంలో నిర్వహించిన పేరిణి నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. నృత్య ప్రదర్శనను చూసేందుకు ములుగు పట్టణంతో పాటు పలు గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు ఇన్‌చార్జ్జి డీఆర్వో కూతాటి రమాదేవి, తహసీల్దార్ గన్యానాయక్, ఎస్సై బండారి రాజు, బీహార్‌లోని మహాత్మగాంధీ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల నర్సయ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కర్ణాటక సంగీత గాత్ర కచేరిని గచర్ల అనిల్ కుమార్ నిర్వహించారు. అనంతరం పేరిణి నృత్య ప్రదర్శన చేసిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను, నాట్య గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ములుగు సబ్ రిజిస్ట్ట్రార్ తస్లీమ్‌మహ్మద్, చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్యన్, మహర్షి కళాశాల కరస్పాండెంట్ తుమ్మ పిచ్చిరెడ్డి, డాక్టర్ సుతారి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...