జాతిపితకు కవుల ఘన నివాళి


Mon,April 22, 2019 03:02 AM

-మహాత్మాగాంధీ నవతరానికి స్ఫూర్తి
-ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం
-ప్రముఖ రచయిత రామచంద్రమౌళి
న్యూశాయంపేట, ఏప్రిల్21: భారత జాతిపిత మహాత్మాగాంధీ జయం తి సందర్భంగా హన్మకొండ శ్రీరాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయంలో సృజన లోకం, ఉజ్వల సాహితీ సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం కవి సమేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో మూడు తరాలకు చెందిన కవులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ దేశానికి చేసిన సేవలను వివిధ కోణాల్లో స్మరించుకుంటూ తమతమ కవితా పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ప్రముఖ రచయిత రామచంద్రమౌళి, వీఆర్ విద్యార్థి, సిరాజుద్ధీన్, రాజ్‌మోహన్ హాజరై మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. సంయోజకులుగా శనిగరపు రాజ్‌మోహన్ వ్యవహరించారు. ఈ సందర్భంగా రామ చంద్రమౌళి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓరుగల్లుకు మంచి గౌరవం ఉందని తెలిపారు. ఇక్కడి నుంచి మంచి సాహిత్యం వస్తుందని అందరూ ఆశిస్తున్నారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీని భారత దేశం కంటే ప్రపంచ దేశాలు బాగా గుర్తించాయని చెప్పారు. గాంధీ రాబోవు తరాలకు రోల్ మోడల్ అని కొనియాడారు. అహింసా సిద్దాంతకర్త, నిబ్బరం కల్గిన వ్యక్తి అన్నారు. ఎంత మంది అవహేళన చేసినా తాను నమ్మిన సిద్ధాంతంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించారన్నారు. గాంధీ అంహిసా, సత్యాగ్రహాల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. కార్యక్రమంలో ఆహూతులను అలరించిన కవులందరికీ శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ శివరామప్రసాద్, పొట్లపల్లి శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత, నెల్లుట్ల రమాదేవి, ప్రొఫెసర్ అహ్మద్, వహీద్‌కుల్దాన్, ఇక్బాల్, నల్లెల రాజయ్య, బాలబోయిన మహేందర్, వకుళ, బండారి రాజ్‌కుమార్, బిల్లా మహేందర్, చంద్రమౌళి, భవానీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...