ఎంపీటీసీ, జెడ్పీటీసీ పీఠంపై గులాబీ జెండా ఎగరాలి


Sun,April 21, 2019 02:10 AM

ఐనవోలు ఏప్రిల్ 20: వర్ధన్నపేట నియోజకవర్గమంటే.. టీఆర్‌ఎస్‌కు వన్‌సైడ్ నియోజకవర్గమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మునిగాల సంపత్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే అరూరి, నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి యాదవరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా అరూరి మాట్లాడుతూ..ఎన్నికలేవైనా గెలుపు గులాబీ పార్టీదేనన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకొచ్చి చెరువులు, కుంటలను నింపుతానన్నారు. ప్రణాళికబద్ధంగా ముందుకుసాగి రాబోయే ఎనిమిది నెలలో కాలువల్లో శాశ్వతంగా గోదావరి జలాలు పారించి తీరుతానని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థినే గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రతిపక్షాలకు క్యాడర్ కరువు..
అసెంబ్లీ ఎన్నికల్లో తనను సుమారుగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నియోజకవర్గంలో మొత్తం 83 సర్పంచ్ స్థానాలకు 80 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచారన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్సే సొంతం చేసుకుంటుదని ధీమా వ్యక్తం చేశారు. నియోజవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు క్యాడరే కరువైందన్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.

ఇన్‌చార్జీల కేటాయింపు..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పర్యవేక్షణకు గ్రామాల వారీగా ఇన్‌చార్జీలను కేటాయించారు. ఐనవోలు మండల కేంద్రానికి మారపెల్లి వెంకట్‌రెడ్డి, కంకర శ్రీను, కక్కిరాలపల్లి గ్రామానికి బుర్ర రాజ్‌కుమార్, కొండపర్తికి మిద్దెపార రవీందర్, ముల్కలగూడెంనకు సింగారపు రాజు, నందనం గ్రామానికి పెండ్లి తిరుపతి, రాంనగర్ గ్రామానికి ఆడెపు దయాకర్, ఒంటిమామిడిపల్లికి లింగ రాంచంద్రారెడ్డి, పంథిని గ్రామానికి తక్కళ్లపల్లి చందర్‌రావు, పున్నేల్‌కు మునిగాల సంపత్‌కుమార్, వనమాలకనపర్తి గ్రామానికి ఉస్మాన్‌అలీని నియమించారు. ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకున్న గ్రామానికి సీడీఎఫ్ నిధుల నుంచి రూ.15 లక్షలు కేటాయిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీరామోజు అరుణ, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, సర్పంచులు కుమారస్వామి, దయాకర్, రమేశ్, దేవేందర్, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు మధు, స్వప్న, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గజ్జల్లి శ్రీరాములు, మండల అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ మజ్జిగ జయపాల్, మండల నాయకులు రాజు, చందర్‌రావు, పూర్ణచందర్‌రావు, సత్యం, దేవేందర్, సునిత, మోహన్, రాజశేఖర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...