చింతల్‌తండాలో కూలిన పెంకుటిళ్లు


Sat,April 20, 2019 02:04 AM

ధర్మసాగర్, ఏప్రిల్19: ధర్మసాగర్, వేలేరు మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పెద్దపెండ్యాల, ధర్మసాగర్, నర్సింగరావుపల్లె, వేలేరు మండలంలోని చింతల్‌తండా, వేలేరు, పీచర, మద్దెలగూడెం, శాలపెల్లి గ్రామాల్లో వరి నేలవాలింది. వారం రోజుల్లో చేతికివస్తుందనుకున్న పంట నేలపాలైంది. ధర్మసాగర్ మండల కేంద్రంలో, పెద్దపెండ్యాల, వేలేరు మండల కేంద్రంలో, పీచర, సోడషపెల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి. చింతల్‌తండాకు చెందిన మాలోతు జెగ్గ్‌మాల్ పెంకుటిళ్ల వర్షానికి కూలిపోయింది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవలని బాధితుడు కోరుతున్నాడు.

అకాల వర్షం..తడిసిన ధాన్యం
ఐనవోలు: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని నంద నం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

మడికొండ: మడికొండలో గురువారం సాయంత్రం వడగళ్ల వర్షం పడిం ది. భారీగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రహదారిపై వర్షం నీరు నిలిచి కుంటలను తలపిస్తున్నాయి. జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

వడగండ్ల వాన బీభత్సం..
భీమదేవరపల్లి: మండలంలోని కొత్తకొండ, మల్లారం గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వృక్షాలు నేలకొరిగాయి.

163
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...