రైతులు ఆందోళన చెందొద్దు..


Sat,April 20, 2019 02:03 AM

- ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి
- అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
- పంట నష్టంపై నివేదిక సమర్పించాలని కలెక్టర్లకు ఆదేశం
- ప్రతి రైతునూ ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి భరోసా

వరంగల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం మంత్రి స్వగృహంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షం, వడగళ్ల వానతో కలిగిన నష్టంపై సమీక్షించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక సమర్పించాలని ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వడగళ్ల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకునేందుకు ప్రభు త్వం కృషి చేస్తుందని, రైతులు ఆవేదన చెందవద్దని కోరారు. సీఎం కేసీఆర్ రైతాంగానికి అండగా ఉన్నారని గుర్తు చేశారు. పంట నష్టపరిహారం వివరాలు అందగానే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు.

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...