రైతులకు అండగా సీఎం కేసీఆర్


Sat,April 20, 2019 02:03 AM

మడికొండ, ఏప్రిల్ 19: వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అకాల వర్షంతో ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తారన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి నష్ట పరిహారం అందించాలని ఆదేశించారు.

వడగళ్లతో భారీ నష్టం..
వడగళ్ల వర్షంతో రైతులు భారీగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటలను గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. మడికొండ(కుమ్మరిగూడెం) 875 ఎకరాలు, భట్టుపల్లిలో 80ఎకరాలు, కొత్తపల్లిలో 100ఎకరాలు, కడిపికొండలో 252ఎకరాలు, కాజీపేట దర్గాలో 98ఎకరాలు, తరాలపల్లిలో 71ఎకరాలు, అమ్మవారిపేటలో 60ఎకరాలు, రాంపూర్‌లో 31ఎకరాలు పంట నష్టం జరిగినట్లు వీఆర్వో సుఖేందర్‌రెడ్డి తెలిపారు. అలాగే కుమ్మరిగూడెలో వరి పంటతో పాటు కూరగాయల తోటలు సైతం దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...