వడగండ్ల రైతులను ఆదుకుంటాం


Sat,April 20, 2019 02:03 AM

న్యూశాయంపేట, ఏప్రిల్19: వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నా రు. బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం న్యూశాయంపేటకు చెందిన రైతులు టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మాడిశెట్టి శివశంకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి పంటను చూపించారు. న్యూశాయంపేట కోట చెరువు కింద సాగు చేస్తున్న సుమారు 80ఎకరాల్లో వరిపంట దాదాపు 20ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టపోయామని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. వారం రోజుల్లో పంట చేతికివచ్చేదని, వడగండ్ల వాన తమకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వడగండ్ల వానతో నష్టపోయిన రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ గుండు సదానందం, సీనియర్ నాయకుడు దేవులపల్లి జానకీరాములు, రైతులు కర్ణాకర్, శివ, కుమారస్వామి, రాజేందర్, రాజు, గోవింద్, రాందాస్, వీరస్వామి,కొమురయ్య, మల్లిఖార్జున్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం...
కాజీపేట: రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సర్కార్ పని చేస్తోందని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి బోడగుట్ట పరిసర ప్రాంతంలో నేల రాలిన పంటలను ఆయన శుక్రవారం పరిశీలించి రైతులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులను రాజుగా చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. అకాల వర్షంతో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అబూబక్కర్, నాయకులు మహ్మద్ సోని, అఫ్జల్, రైతులు విక్రం, రవి,ప్రసాద్, శ్రీనివాస్, పొన్నం, విక్రం, రేష్మా, భారతి, సరళ తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...