ఫొటో జర్నలిస్టుల కార్యవర్గం ఎన్నిక


Sat,April 20, 2019 02:03 AM

న్యూశాయంపేట, ఏప్రిల్19: తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాతో పాటు జనగామ, మహబూబాబాద్ జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హన్మకొండ బాలసముద్రంలోని నక్షత్ర కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(143)సంఘం ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ ఫొటో జర్నలిస్టులు మంచి ఛాయాచిత్రాన్ని తీయడానికి ఆహర్నిశుల కృషిచేస్తారని, పత్రికలకు పేరుతెచ్చే విధంగా పనిచేస్తారని అన్నారు. ఫొటో జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు ఉన్నా టీయూడబ్ల్యూజే సంఘానికి తెలియజేయాలన్నారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్‌కార్డుల విషయంలో తమ వంతు సహాయ సహారాలు అందజేస్తామని అన్నారు. టీపీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా స్థాయిలోని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, జిల్లా కమిటీలను సమన్వయ పరుస్తూ సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గాయపడిన జర్నలిస్టులకు, ధ్వంసమైన కెమెరాలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందజేశామని అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాలు సమస్యల పరిష్కారాని కృషిచేయాలని సూచించారు. కార్యక్రమలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు కూన మహేందర్, మెండు రవీందర్, జిల్లా కార్యదర్శి శుభాశ్, ప్రెస్‌క్లబ్ కార్యదర్శి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, సీనియర్ పాత్రికేయులు నూర శ్రీనివాస్, పిన్న శివకుమార్, ఎలక్ట్రాన్ మీడియా కార్యదర్శి అశోక్, నాగరాజు, రూరల్ కార్యదర్శి ఉమేందర్‌గౌడ్, టీపీజేఏ కార్యవర్గ సభ్యులు యాదగిరి, జిల్లా మాజీ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాం, సుధాకర్, సీనియర్ పాత్రికేయులు ఆడెపు ఉమేశ్, తుమ్మ కృష్ణారెడ్డి, వివిధ జిల్లాల ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు.

వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా నూతన కమిటీ
అధ్యక్షుడిగా దాసరి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా చకినాల శ్యాంసుందర్, కార్యదర్శిగా గొట్టె వెంకన్న, సహాయ కార్యదర్శిగా వీరగోని హరీశ్‌గౌడ్, కార్యవర్గ సభ్యులుగా పంపేట వెంకటేశ్వర్లు, బెలిదే శ్రీనివాస్, మసూక్, మండ కిశ్‌ర్, మెరుగు ప్రతాప్‌ను ఎన్నుకున్నారు.

జనగామ జిల్లా : అధ్యక్షుడిగా స్వర్గం చంద్రశేఖర్, కార్యదర్శిగా నాగఫణిరాజ్, కోశాధికారిగా రచ్చ మోహన్, కార్యవర్గ సభ్యులుగా గోవర్ధన్, వేణుగోపాల్‌ను ఎన్నుకున్నారు.
మహబుబాబాద్ జిల్లా : అధ్యక్షుడిగా పాలకుర్తి మధుసూదన్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా సందీప్, కార్యదర్శిగా మురళీమోహన్, కోశాధికారిగా రఘుపతి, కార్యవర్గ సభ్యులుగా కృష్ణ, నారాయణరావును ఎన్నుకున్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...