22 నుంచి పందిళ్ల శేఖర్‌బాబు స్మారక నాటకోత్సవాలు


Sat,April 20, 2019 02:02 AM

న్యూశాయంపేట, ఏప్రిల్19: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, చలనచిత్రాభివృద్ధి సంస్థ సౌజన్యంతో ఈ నెల 22నుంచి మూడు రోజుల పాటు పందిళ్ల అశోక్‌బాబు స్మారక నాటరోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డ్రమటిక్ అసోసియేషన్ నిర్వాహకుడు ఆకుల సదానందం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాదవ్ కళాప్రాంగణంలో ఈ నెల 22నుంచి 24వరకు మూడు రోజుల పాటు ప్రతీ రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నామన్నారు. 22న ప్రారంభ సమావేశానికి పందిళ్ల శేఖర్‌బాబు స్మారక నాటకోత్సవ అధ్యక్షులు వనం లక్ష్మీకాంతారావు అధ్యక్షత నిర్వహిస్తామన్నారు. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు జ్యోతి ప్రజ్వలన చేస్తారన్నారు. విశిష్ట అథితులుగా వరంగల్ కార్పొరేషన్ ఇన్‌చార్జీ మేయర్ ఖాజా సిరాజుద్థీన్, అత్మీయ అతిథులుగా కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, దూరదర్శన్ వరంగల్ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏపీఏఓ యాదగిరి, రావిశెట్టి రాజేశ్వరావులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. 22 సాయంత్రం 7గంటలకు రైతే రాజు సాంఘీక నాటిక భూపతి ధర్మారావు రచన, దర్శకత్వంలో, రాత్రి 8గంటలకు శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక నాటకం రచన కీ.శే. తిరుపతి వెంకటకవులు, దర్శకత్వం తోట సత్యనారాయణ, ఆకుల సత్యనారాయన నిర్వాహానంలో నిర్వహిస్తున్నామన్నారు.

24న సాయంత్రం 6.30గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు సభాధ్యక్షులుగా వ్యవహిరిస్తారని, ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేస్తారని, విశిష్ట అతిథిలుగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్, ఆత్మీయ అతిథిగా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ అతిథులగా రాష్ట్ర నాటక సమాజాల అధ్యక్షులు తడకమళ్ల రామచందర్‌రావు, మహేందర్‌రెడ్డి పాల్గొంటారని ప్రముఖ నటులు దర్శకులు జివి. బాబును సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. రాత్రి 7గంటలకు జిపిఎల్ మీడియా హైదరాబాద్ వారి బైవన్-గెట్‌టు సందేశాత్మక సాంఘీక నాటికను, రాత్రి 8గంటలకు నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ వెపిహెచ్‌బీ కాలనీ హైదరాబాద్ వారి బాలనాగమ్మ జానపద నాటికను ప్రదర్శిస్తారని తెలిపారు. 24న సభాధ్యక్షులుగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు దాస్యం వినయ్‌భాస్కర్ సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారని అన్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేస్తారని చెప్పారు.

విశిష్ట అతిథిగా ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి,అత్మీయ అతిథిలుగా ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ వీనస్ ఐటీఐ, కళాకమలాసన బిరుదాంకితులు రామోజు సందరమూర్తి, అసోసియేషన్ గౌరవ సలహాదారు పందిళ్ల అశోక్‌కుమార్, గౌరవ సలహాదారు బోయినపల్లి పురుషోత్తమరావు, వరంగల్ విశ్రాంత పోలీసు ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు రాధారపు సంజీవరెడ్డి, పందిళ్ల రమేశ్‌బాబులు హాజరవుతారని తెలిపారు. ప్రసిద్ధ పౌరాణిక నటులు, దర్శకుడు మంతోజు శాల్వాచారి పందిళ్ల శేఖర్‌బాబు స్మారక పురస్కారం పందిళ్ల సోదరులు అందించనున్నట్లు ఆయన తెలిపారు. రాత్రి 7గంటలకు రసరమ్య కళారంజనీ నల్గొండ వారిచే ఐదోదిక్కు సాంఘిక నాటకం, రాత్రి 8గంటలకు ఏఏటీఎం అవర్‌నేస్ అసోసియేషన్ ఫర్ థియర్ అండ్ మ్యూజిక్ కేసీహెచ్‌బీ కాలనీ హైదరాబాద్ వారిచే యాదాద్రి శ్రీలక్ష్మీనరసంహా స్వామి వారి కల్యాణం పౌరాణిక నాటికను ప్రదర్శిస్తారని తెలిపారు. వనం లక్ష్మీకాంతరావు, రావిశెట్టి రాజేశ్వర్‌రావు-సుజాతదేవి, బోయినపల్లి పురుషోత్తమరావు, రామోజు సుందరమూర్తి పారితోషిక దాతలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...