ఇంటర్‌లో బాలికలదే పైచేయి


Fri,April 19, 2019 03:00 AM

రెడ్డికాలనీ, ఏప్రిల్ 18: ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిలే పై చేయి సాధించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ, వొకేషనల్ పరీక్షల ఫలితాలను గురువారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు హన్మకొండలోని డీఐఈవో కార్యాలయంలో లింగయ్య ఫలితాలను ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియెట్ మొదటి, సెకండియర్ పరీక్షలు జరిగాయి. వరంగల్ అర్బన్ జిల్లావ్యాప్తంగా నాలుగు ర్యాంకులు సాధించారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల వ్యాప్తంగా మొదటి సంవత్సరం బాలుర జనరల్‌లో 9864 మంది పరీక్ష రాయగా 6063 (61 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు, అమ్మాయిల జనరల్‌లో 10,271 మందిలో 7288 (71 శాతం) మంది ఉత్తీర్ణతతో మొత్తం అబ్బాయిలు, అమ్మాయిలు 20,135 మందికిగాను 13,351 (66 శాతం) వచ్చినట్లు డీఈవో తెలిపారు.

వొకేషనల్‌లో..
మొదటి సంవత్సరం వొకేషనల్ బాలురలో 402 మందికి గాను 153(38 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు, వొకేషనల్‌లో అమ్మాయిలు 699 మందికిగాను 451 (65 శాతం).. మొత్తం 1101 మందికి గాను 604(55 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. జనరల్, వొకేషనల్‌లో బాలురు 10,266 మందికి గాను 621 6(60.5) ఉత్తీర్ణత పొందినట్లు, అమ్మాయిలు 10,970కి గాను 7739(70.5 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని, మొత్తం మొదటి సంవత్సరంలో 21,236 మందికి గాను 13,955(65.7) పాసైనట్లు డీఐఈవో లింగయ్య తెలిపారు.

సెకండియర్ ఫలితాల్లో..
వరంగల్ అర్బన్ జిల్లావ్యాప్తంగా సెకండియర్ ఫలితాలలో 69 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఐఈవో లింగయ్య తెలిపారు. జనరల్ బాలురలో రెగ్యులర్ 8541 మందికిగాను 5529(64 శాతం) మంది, ప్రైవేటు 1615 మందికి గాను 442 (27 శాతం), వొకేషనల్ రెగ్యులర్‌లో 308 మందికి గాను 177(57 శాతం), ప్రైవేటు 48 మందికి గాను 22 (46 శాతం)మంది, అమ్మాయిల జనరల్ రెగ్యులర్‌లో 10,335కి గాను 7652(74 శాతం) జనరల్ రెగ్యులర్‌లో మొత్తం అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి 18,876కి గాను 13,181 (69 శాతం) అమ్మాయిల జనరల్ ప్రైవేటులో 1431కి గాను 479 (33 శాతం), మొత్తం అమ్మాయిలు, అబ్బాయిలు 3046కి గాను 921 (30 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ రెగ్యులర్ అమ్మాయిలు 600 మందికి గాను 490 (82 శాతం), మొత్తం అమ్మాయిలు, అబ్బాయిలు 908కి గాను 667 (73 శాతం), వొకేషనల్ ప్రైవేటులో అమ్మాయిలు 44కి గానూ 22(50 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం అమ్మాయిలు, అబ్బాయిలు 92 మందికి గాను 44 (48 శాతం) మొత్తం జనరల్, ఒకేషనల్‌ల్లో అబ్బాయిల్లో 10,512కి గాను 6170 (58.6 శాతం), అమ్మాయిల్లో 12,410కి గాను 8643 (69.6 శాతం) మొత్తం అమ్మాయిలు, అబ్బాయిలు 22,922 గాను 14,813 (64.62 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

అర్బన్ జిల్లాలో నాలుగు ర్యాంకులు
ఇంటర్ ఫలితాల్లో అర్బన్ జిల్లాలో నాలుగురు ర్యాంకులు పొందారు. సీఈసీలో షేక్ షాజీమా(6వ ర్యాంకు), ఎంపీసీలో తుమ్మేటి రితిక (7వ ర్యాంకు), కడారి గీత (8వ ర్యాంకు), హెచ్‌ఈసీలో జంగం శివాని (9వ ర్యాంకు) పొందారు. వీరిని కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...