మద్దెలగూడెం ఉదంతంపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్


Fri,April 19, 2019 03:00 AM

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ:ఉపాధిభోక్తపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సీరియస్ అయ్యారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. వివరాలు ఆరా తీశారు. ఉపాధి కూలీల సొమ్మును పక్కదారి పట్టించడంపై పూర్తి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నమస్తే తెలంగాణ మోగించిన ధర్మగంటకు స్పందన ఇది. జిల్లాలోని వేలేరు మండలంలోని మద్దెలగూడెం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధిభోక్తగా మారిన వైనంపై గ్రామ కూలీలు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై నమస్తే తెలంగాణ గురువారం ఉపాధి భోక్త, ఇద్దరి పేర డబ్బులు కాజేసిన ఫీల్డ్ అసిస్టెంట్, వాళ్లూ ఆయన బంధువులే.. అంటూ ప్రచురించిన కథనం కలకలం రేపింది. ఈ కథనానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. మంత్రి స్పందనతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ రాము తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ధర్మసాగర్ ఎంపీడీవో జవహర్‌రెడ్డి, జిల్లా సహాయక విజిలెన్స్ అధికారి నర్సింహారెడ్డిని విచారణ అధికారులుగా నియమించారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. నివేదిక రాగానే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మిట్ట రాజు తన సంబంధీకుల పేర్లతో పనులు చేయకుండా చేసినట్టుగా రికార్డులు సృష్టించి డబ్బులు కాజేశారనే ఆరోపిస్తూ మద్దెలగూడెం కూలీలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...