ఫిజియోథెరపీలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి


Thu,April 18, 2019 01:42 AM

రెడ్డికాలనీ, ఏప్రిల్ 17: ఫిజియోథెరపీ విద్యలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ బీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ప్రధానంగా పీజీ ఫిజియోథెరపీ ఫలితాలు గరిష్ఠంగా పడిపోయాయని, సమస్య ఎక్కడ ఉందో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. యూజీ, పీజీ ఫిజియోథెరపీ బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశాలు హన్మకొండలోని అశోకా కాన్ఫరెన్స్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యాబోధనలో మార్పు అవసరమా, ఏ విధమైన చర్యలు చేపడితే విద్యార్థులు రాణిస్తారో పరిశీలించుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.

విద్యాబోధన మెరుగుపడటమే లక్ష్యంగా పనిచేయాలని అధ్యాపకులకు సూచించారు. పాఠ్యంశాల్లో మార్పులు ఉంటే సూచించాలని, నాణ్యమైన వైద్య విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థులు కళాశాలలో చేరి తరగతులకు రాకుండా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. వీటిని అరికట్టేందుకే విద్యార్థులకు, ఫ్యాకల్టీకి బయోమెట్రిక్ హాజరు తప్పని సరి చేయడం జరిగిందని తెలిపారు. బీపీటీకి ప్రొఫెసర్ పీ వంశీకృష్ణ, ఎంపీటీకి సీహెచ్ సీతారాంబాబు బీఓఎస్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ డాక్టర్ టీ వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ డీ ప్రవీణ్‌కుమార్, సీవోఈ డాక్టర్ వై మల్లీశ్వర్, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ డీ రమేశ్‌కుమార్, ఓఎస్డీ ఎస్‌వీ సత్యనారాయణ, డిప్యూటీ రిజిస్ట్రార్లు సుధాకర్, డాక్టర్ కే హేమంత్‌కుమార్, పీఆర్వో ఎం కిరణ్మయి, బీవోఎస్ సభ్యులు వీ వందన, హన్నా రాజశేఖర, కల్యాణ్, మౌనిమారెడ్డి, బీ సంపత్‌రెడ్డి, జీ హిమబిందు, టీ వెంకటేశ్వర్లు, కే మాధవి, అపర్ణ కొండపల్లి, జీ ప్రసన్న, జేఎన్ శ్రవణ్‌కుమార్, కే సుధారాణి, డీ సురేఖ, కే ఆదిత్య, సాయి జయప్రకాశ్, హరికుమా ర్, తౌఫిక్ అహ్మ ద్, లావణ్య, లహ రి, అరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...