ప్రశాంతంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష


Wed,April 17, 2019 02:23 AM

-97.84శాతం మంది హాజరు
-నగరంలోని 16 సెంటర్లలో పరీక్ష
మట్టెవాడ/వరంగల్‌చౌరస్తా, ఏప్రిల్ 16 : ప్రభుత్వ, ప్రైవేట్, ఏయిడెడ్ పాలిటెక్నిక్‌లలో ప్రవేశం పొందేందుకు నిర్వహించిన పాలీసెట్-2019 మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని 16సెంటర్ల ద్వారా 8869మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వరంగల్ కో ఆర్డినేటర్, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. 5384మంది బాలురకు గాను 5259మంది హాజరయ్యారని, 3681మంది బాలికలకు గాను 3610మంది బాలికలు పరీక్షలకు హాజరైనట్లు ఆయన వివరించారు. అంటే మొత్తం 9065మందికి గాను 8869మంది విద్యార్థులు హాజరయ్యారని, 97.84 హాజరు శాతం నమోదైందని ఆయన వివరించారు. పరీక్షలకు సహకరించిన పోలీస్ యంత్రాంగానికి, మెడికల్, ఆర్టీసీ, ఎడ్యూకేషన్, రెవిన్యూ సిబ్బందికి వరంగల్ జిల్లా సమన్వయాధికారి డాక్టర్ బైరి ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 800గాను 788మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలికలు)కృష్ణాకాలనీలో 600గాను 588, మహబూబియా పంజేతన్ జూనియర్ కళాశాలలో 600గాను 591, ఇస్లామియా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 500గాను 491, లాల్ బహూదూర్ కళాశాలలో 750గాను 743, ఎల్బీ కళాశాల పీజీ సెంటర్లో 500గాను 493, ఏవీవీ డిగ్రీ కళాశాలలో 500గాను 487,హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలో 800గాను 778, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలో 500గాను 480, యూనివర్సిటీ మహిళా కళాశాలలో 300గాను 297, యూ నివర్సిటీ లా కళాశాలలో 250గాను 246, మాస్టర్ జీ డిగ్రీ , పీజీ కళాశాలలో 600గాను 579, చైతన్య డిగ్రీ కళాశాలలో 840గాను 821,చైతన్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్‌లో 600గాను 585, ఎస్‌వీఎస్ గ్రూఫ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్‌లో 611గాను 595, ఎస్‌వీఎస్ పాలిటెక్నిక్‌లో 317గాను 307మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాసినట్లు ఆయన తెలిపారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...