ప్రజల భద్రత.. మా బాధ్యత


Wed,April 17, 2019 02:22 AM

-నేరరహిత కమినరేట్‌గా వరంగల్
-25 ద్విచక్రవాహనాలు, మూడు బెల్ట్‌షాపులు సీజ్
-నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్
-కార్డన్ సెర్చ్‌లో సీపీ వీ రవీందర్
భీమారం, ఏప్రిల్16: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటల నిఘాను ఏర్పాటుచేసి ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వీ రవీందర్ అన్నారు. శాంతి భద్రతల నియంత్రణలో భాగంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని నిరూప్‌నగర్ తండా, మధు తండాల్లో మంగళవారం రాత్రి కార్డన్ సెర్చ్‌ను నిర్వహించారు. నిరూప్‌నగర్ తండాలో ప్రజలు, మహిళలతో చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా, ప్రజలకు భద్రతపైన భరోసా కల్పించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరంతరం బ్లూకోట్స్, పెట్రోకార్ ద్వారా నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ గతంలో నేరాలకు పాల్పడిన నేరస్తులపై నిఘా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. నేర రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. నేరాలను అదుపు చేసేందుకు ప్రజలు స్వచ్ఛందగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలతో నేరస్తులను నియంత్రించి నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించవచ్చున్నారు. నేరాలు పదే పదే చేస్తున్న వారిపై, భూమాఫియా, రౌడీషీటర్స్ శాంతి భద్రతకు విఘాతం కల్గిస్తే ఉపేక్షించేది లేదని, వారిపైన పీడీ యాక్ట్ కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు. అదే పనిగా నేరాలు చేస్తున్న 59 మందిపై పీడీ యాక్ట్ కేసులను నమోదు చేసినట్లు వివరించారు.

25 వాహనాలు సీజ్..
నిరూప్‌నగర్ తండా కార్డన్‌సెర్చ్‌లో ఏలాంటి పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు , మూడు బెల్ట్ షాపులను పోలీసులు సీజ్ చేశారు. నిరూప్‌నగర్ తండా, మధుతండా, కోమటిపల్లి తండాల్లో 150 మంది పోలీసులు, డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు అనుమానిత ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో నివసించే రౌడీ సీటర్లు,గతంలో నేరాలకు పాల్పుడిన నేరస్థుల ఇండ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రామాల్లో, తండాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ నరసింహ, హన్మకొండ ఏసీపీ శ్రీధర్, ఇన్‌స్పెక్టర్లు రాఘేందర్‌రావు, సంపత్‌రావు, సదయ్య, ఎస్సై విఠల్, పోలీసులు విసృత్తంగా తనిఖీలు చేశారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...