సత్యవతి రాథోడ్ అనే నేను..


Tue,April 16, 2019 02:11 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎమ్మె ల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన సత్యవతిరాథోడ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఫిబ్రవరి 22న ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యవతిరాథోడ్ పేరును రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 12న నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్యవతిరాథోడ్ విజయం సాధించగా.. సోమవారం ఆమె ప్రమాణస్వీకారం చేశారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు పెద్దఎత్తున హైదరబాద్‌కు తరలివెళ్లి సత్యవతిని కలిసి, అభినందనలు తెలిపారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో సత్యవతిరాథోడ్ చేరారు. అప్పటి నుంచి పార్టీకి విధేయురాలిగా ఉంటూ వస్తున్నారు. గిరిజన మహిళలకు ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడంతో పాటు గెలుపు బాధ్యతను కూడా స్వయంగా కేసీఆర్ చూశారు. ఒక గిరిజన మహిళకు అత్యున్నత పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్‌ను జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు. మార్చి 12న ఎమ్మెల్సీగా గెలిపొందిన వెంటనే ఆమెకు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి టీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. సత్యవతిరాథోడ్ ప్రమాణస్వీకార సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుతో పాటు రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు. వీరితో మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, డీఎస్ రెడ్యానాయక్, హరిప్రియనాయక్, రేగాకాంతారావు, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జీలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావులు సత్యవతిరాథోడ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. మరోవైపు జిల్లా నుంచి టీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలివెళ్లారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...