వైద్య బోధనలో శ్రద్ధ వహించాలి


Tue,April 16, 2019 02:10 AM

రెడ్డికాలనీ, ఏప్రిల్ 15: వైద్య బోధనలో అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ బీ కరుణాకర్‌రెడ్డి అన్నారు. యూజీ, పీజీ యునాని, ఎంపీహెచ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాలు సోమవారం హన్మకొండ అశోకా కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. మెడికల్, డెంటల్ బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశాలు గత నెల నిర్వహించారు. ఈ విడతలో ఆయుర్వేద, న్యాచురోపతి, యునాని, పబ్లిక్ హెల్త్, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపి తదితర కోర్సుల బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశాలు నిర్వహించేందుకు యూనివర్సిటీ వర్గాలు ఏర్పాటు చేశారు. ఈనెల 18 వరకు బీవోఎస్ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా సోమవారం యునాని బీవోఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య బోధనలో అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య, రోగులకు మెరుగైన చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రొఫెసర్లపై ఉందన్నారు. ఫ్యాకల్టీ కళాశాలలకు అదేవిధంగా డాక్టర్లు ఆస్పత్రిలో ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రభుత్వం ఇటువంటి చర్యలను సీరియస్‌గా పరిగణిస్తుందని హెచ్చరించారు. ఫ్యాకల్టీ ఖచ్చితంగా కళాశాలకు హాజరు కావాలని అదేవిధంగా డాక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలన్నారు.

విద్యార్థులు తరగతులకు గైర్హాజరైన పక్షాన తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో రెక్టార్ డాక్టర్ వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, సీవోఈ డాక్టర్ మల్లీశ్వర్, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేశ్‌కుమార్, ఓఎస్డీ ఎస్వీ సత్యనారాయణ, డిప్యూటీ రిజిస్ట్రార్లు డాక్టర్ హేమంత్‌కుమార్, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్ డాక్టర్ శహజాది సుల్తానీ, సభ్యులు మున్నావర్ హజ్మి, డాక్టర్ ఎండీ సిద్దికుద్దీన్ అలీ జవాద్, డాక్టర్ ఎంఏ ఫారూకి, డాక్టర్ జేబున్నిసాబేగం, డాక్టర్ హెచ్‌ఎంఏ రషీద్, డాక్టర్ క్యూఎన్ ఖుద్సియా, ఖామారుద్దీన్, డాక్టర్ మొహమ్మద్ మాక్బుల్ హుస్సేన్, సయ్యద్ అభిదున్నిసా, డాక్టర్ నూర్‌బానునూరి, డాక్టర్ ఎండీ సిరాజుల్‌హాక్, డాక్టర్ ఎం జయరాం, డాక్టర్ నందకిశోర్, డాక్టర్ బీఆర్ శ్యామన్న తదితరులు పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...