కల్యాణం.. కమణీయం


Mon,April 15, 2019 02:52 AM

రెడ్డికాలనీ, ఏప్రిల్ 14: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో సీతారాముల కల్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య మహావైభంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ జరిపించారు. ఉదయం ప్రాతఃకాల పూజా అనంతరం సీతారామలక్ష్మీ ఆంజనేయ స్వాములకు నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉద్వాసన పూజచేసి స్వామివార్లకు మంగళసాన్నం చేయించారు. అనంతరం నూతన వస్ర్తాలంకరణ, బాసిక ధారణ ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివార్లను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠాపన కార్యక్రమం స్వస్తిపుణ్యవాచనం మంఠపారాదన కలుషస్థాపన అనంతరం కల్యాణ క్రతువును వైష్ణవ సాంప్రదాయ పండితుల ఆధ్వర్యంలో వైభవంగా జరిపించారు. పునర్వసు నక్షత్రమున అభిజిత్ లగ్నంలో 10.40 నిమిషాల సుమూహుర్త సమయంలో జీలకర్ర బెల్లం గావించి, పాదప్రక్షాలన మహాసంకల్ప మంత్రపఠనంతో నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలతో స్వామివార్లకు అక్షతారోహణ చేసిన అనంతరం నూతన వస్ర్తాలు సమర్పించి స్వామివార్లకు బ్రహ్మముడి వేసి కల్యాణం చేశారు. గొడిశాల శ్రీధర్ ఆధ్వర్యంలో మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

హనుమాన్ అలంకరణలో..
శివాయ విష్ణురూపాయ అంటూ దేవాలయంలో మూల విరాఠ్ అయిన రుద్రేశ్వరుడికి 51 కిలోల పెరుగన్నంతో అన్నసూక్త మంత్రపఠనంతో మహాన్నపూజ నిర్వహించి రామధూత హనుమాన్ అలంకరణలో అలంకరించారు. సీతారామచంద్ర కల్యాణోత్సవంలో రుద్రేశ్వర సేవా సమితి సభ్యులు మామిడాల గణపతి, శివలింగాచారి, కాశీనాథచారి, పులి రజినీకాంత్, శ్రీధర్‌గౌడ్ పాల్గొని విశిష్ఠ సేవలందించారు. వేద పండితులు విజయకుమారాచర్యులు, గంగు మణికంఠశర్మ ధ్వర్యంలో కల్యాణాన్ని మహావైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తలంబ్రాలు, కంకణాలు అందజేశారు.

161
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...