సీతారాముల కల్యాణం


Mon,April 15, 2019 02:51 AM

కరీమాబాద్,ఏప్రిల్14: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలు ఆలయాలు, కాలనీల్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా జరిపించారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్-వాణి దంపతులు పలు చోట్ల చేపట్టిన స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు. కరీమాబాద్‌లోని బొమ్మలగుడిలో నిర్వహించిన స్వామి వారి కల్యాణంలో రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్‌పర్స్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఆయా డివిజన్ల కార్పొరేటర్లు కేడల పద్మ, మరుపల్ల భాగ్యలక్ష్మి, మేడిది రజిత, కత్తెరశాల వేణుగోపాల్ సైతం వేడుకల్లో పాల్గొన్నారు. ఖిలావరంగల్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి రంగశాయిపేటలోని రామాలయంలో నిర్వహించిన కల్యాణాన్ని తిలకించారు. లక్ష్మీనగర్‌లోని తారకరామ ఫంక్షన్‌హాల్ వద్ద చేపట్టిన పెండ్లి తంతులో సిద్దం రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని పలు డివిజన్లలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పాల్గొన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు మరుపల్ల భాగ్యలక్ష్మి, కత్తెరశాల వేణుగోపాల్, నాయకులు మరుపల్ల రవి,ఆరెల్లి రవి,రామ్మూర్తి పాల్గొన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...