ఘనంగా రాములోరి కల్యాణం


Mon,April 15, 2019 02:50 AM

మడికొండ : మడికొండలోని మెట్టుగుట్టపైనున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు అనుముల నరసింహమూర్తి, అర్చకులు విష్ణువర్ధనాచార్యులు, రాగిచేడు అభిలాషశర్మ వేద మంత్రాల మధ్య కల్యాణతంతు పూర్తిచేశారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ చైర్మన్ అల్లం శ్రీనివాసరావు-కవిత దంపతులు, భక్తులు అద్దంకి సురేశ్-రజిని, రత్నాకర్, వాసులు స్వామివారికి ముత్యాలు, తలంబ్రాలు అందించగా గుర్రపు లలిత-జగదీశ్వర్ దంపతులు మంగళసూత్రాలు, మట్టెలు, ఆవాల నరోత్తంరెడ్డి-రాధికారెడ్డి దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించి కల్యాణంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సదుపాయాలు కల్పించారు. అలాగే ఇన్‌స్పెక్టర్ జాన్ నర్సింహులు ఆధ్వర్యంలో ఎస్సై కుమారస్వామి, వలంటీర్లు బందోబస్తు నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు జరిపించారు. అనంతరం మహా అన్నదానం చేశారు. సాయంత్రం హోమం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పరాశరం రామాచార్యులు, పారుపల్లి సత్యనారాయణశర్మ భక్తులు ఆకుల శ్రీనివాసులు, బొడ్ల శ్యాంసుందర్, గంగారపు రమేశ్, అరూరి తిరుపతి, పెద్ది ప్రభాకర్, చిగురుపాటి వెంకటేశ్వర్లు, పల్లపు నర్సింగరావు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...