దళితవాడల అభివృద్ధే ధ్యేయం


Mon,April 15, 2019 02:49 AM

ఖిలావరంగల్, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ దళిత వాడల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శివనగర్ 9వ డివిజన్‌లోని అంబేద్కర్ భవనంలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని దళిత వాడల అభివృద్ధికి తన వంతుగా సహకారం అందిస్తామన్నారు. యువజనం సంఘం అధ్యక్షులు పోలెపాక నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, టీఆర్‌ఎస్ నాయకులు సోమిశెట్టి ప్రవీణ్, శామంతుల శ్రీనివాస్, జనార్ధన్, ఎలేందర్, ఉపేందర్, సంపత్, ప్రకాశ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

ఖిలావరంగల్‌లో..
ఖిలావరంగల్ పడమర కోట చమాన్ సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు 8వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్ హాజరై మాట్లాడారు. కోటలో అంబేద్కర్ భవనానికి రూ.20లక్షలు మంజూరు చేయించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. అలాగే దళిత స్మశానవాటిక కూడా రూ.69లక్షలు మంజూరు చేయించామన్నారు. వచ్చే అంబేద్కర్ జయంతి వేడుకుల వరకు కోటలో విగ్రహం ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నలిగంటి ఇజ్రాయిల్, బీకే, నలిగంటి నవీన్, గొర్రె నరేశ్, నలిగంటి చిన్న, పాల్, నాగరాజు, గద్దల రాంబాబు, మైదం శ్రీను, మైదం అశోక్, శ్యాం పాల్గొన్నారు.

మీ నేస్తం హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో..
మీ నేస్తం హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను కోటలోని ఎస్సీ కాలనీలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకులపెల్లి యాకోబు, గద్దల శ్రీనివాస్, ఆశీర్వాదం, బాబు, మైదం కుమార్, శ్యాంప్రసాద్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

163
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...