ఎర్రబెల్లిలో వికసిస్తున్న విద్యా కుసుమాలు


Mon,April 15, 2019 02:49 AM

భీమదేవరపల్లి, ఏప్రిల్ 14 : వేలేరు మండలంలో ఎర్రబెల్లి కుగ్రామం చదువుల తల్లి సరస్వతీమాతకు నిలయంగా మారుతున్నది. రెండేళ్లక్రితం ఈ గ్రామానికి చెది అక్కాచెల్లెళ్లు శశాంక, ప్రియాంక కలెక్టర్లు కాగా ఇదేగ్రామం తండా నుంచి మరో ఆణిముత్యం.. నూనావత్ ప్రవీణ్‌కుమార్ సివిల్స్‌లో 610ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రవీణ్‌కుమార్‌కు ఆదివవారం సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సదర్భంగా హుస్నాబాద్, స్టేషన్‌ఘణపూర్ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, తాటికొండ రాజయ్య హాజరై ఆయనను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ ప్రవీణ్‌కుమార్ మారుమూల కుగ్రామంలో జన్మించి సివిల్స్‌లో ర్యాంకు సాధించడం అభినందనీయమని, నేటి యువతకు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచిచారు. ఈ గడ్డ నుంచి అక్కాచెల్లెళ్లు శశాంక, ప్రియాంక కలెక్టర్లు కావడం, అలాగే ప్రవీణ్‌కుమార్ సివిల్స్‌లో ర్యాంక్ మంచి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అనగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని స్టేషన్‌ఘణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నూనవత్ ప్రవీణ్‌కుమార్‌ను శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వీరన్ననాయక్, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, ఎంపీపీ సంగ సంపత్‌యాదవ్, జెడ్పీటీసీ రాంచందర్‌నాయక్, సర్పంచ్ గూడ రాజ్‌కుమార్, ఎంపీటీసీ కాలేరు రాధిక, భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...