జానకీరాముల పరిణయం


Mon,April 15, 2019 02:49 AM

పాలకుర్తి/పాలకుర్తి రూరల్, ఏప్రిల్ 14: శ్రీరామ నవమిని పురస్కరించుకుని జానకిరాముల పరిణయం ఆదివారం చూడముచ్చటగా జరిగింది. సీతారాముల కల్యాణం చూతము రారండి... అంటూ భక్తులు వందలాదిగా తరలివచ్చారు. రెండో భద్రాద్రిగా పేరొందిన వల్మిడిలో జానకీరాముల ఉత్సవమూర్తులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య బ్రహ్మణులు కల్యాణ తంతు గావించారు. పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుహూముర్తాన మధ్యాహ్నం 12 గంటలకు వేద పండితులు చక్రవర్తుల మురళీధరాచార్యులు, త్రివేంగళాచార్యులు, కల్యాణం సుందరాచార్యులు, దేవగిరి రామన్నశర్మ, గంగు రఘుశర్మ ఆధ్వర్యంలో సీతారాముల పరిణాయం కనులపండువగా జరిగింది.

భద్రాచలంలో తలంబ్రాలు పడగానే వల్మిడిలో తలంబ్రాలు పచ్చబడ్డాయి. ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, తలంబ్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు-ఉష దంపతులు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్‌రావు, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి నారాయణరావు దంపతులు, రాష్ట్ర జీసీసీ చైర్మన్ మోహన్‌గాంధీనాయక్ దంపతులు వేడుకలో పాల్గొని సీతారాముల పరిణాయాన్ని తిలకించారు. పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అలాగే, విస్నూరులోని సత్యనారాయణస్వామి ఆలయంలో వెన్నమనేని మురళీధర్‌రావు దంపతులు సీతారాముల కల్యాణం జరిపించారు. పాలకుర్తి పాటిమీది ఆంజనేయస్వామి, శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం, పంచగుళ్లు, బమ్మెరలోని కొందండరామస్వామి ఆలయం, దర్దేపల్లిలోని శివాలయం, చెన్నూరు, గూడూరులోని భవాని శంకరాలయంలో సీతారాముల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. వర్ధన్నపేట ఏసీపీ ఏ మధుసూదన్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.

ఆలయాన్ని అభివృద్ధి చేస్తా: మంత్రి
సీఎం కేసీఆర్ సహకారంతో వల్మిడిని రెండో భద్రాద్రిగా తీర్చిదిద్దుతానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నాటికి పనులు మొదలు పెట్టి సీఎం కేసీఆర్‌ను వల్మిడికి తీసుకొస్తానన్నారు. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతానన్నారు. బమ్మెరను మరో బాసరగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వల్మిడి అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజూరు చేశానన్నారు. బమ్మెర నుంచి పాలకుర్తి వల్మిడి దేవస్థానానికి డబుల్ రోడ్డు ప్రతిపాదనలు పంపించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కత్తి సైదులు, పాలకుర్తి వల్మిడి దేవస్థాన చైర్మన్లు వెనుకదాసుల రాంచంద్రయ్యశర్మ, కూటికంటి హరిత సోమయ్య, దేవస్థాన మాజీ చైర్మన్ మాశెట్టి ఉపేందర్, ఎంపీపీ భూక్యా దల్జీత్‌కౌర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్లా నాగిరెడ్డి, పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, సర్పంచ్‌లు వీరమనేని యాకాంతారావు, కల్వల భాస్కర్‌రెడ్డి, పోగు శ్రీనివాస్, పన్నీరు సమ్మయ్య, పుస్కూరి శ్రీనివాస్‌రావు, పసునూరి నవీన్, భూమ రంగయ్య, కాటబత్తిని రమేశ్, కటారి పాపారావు, కమ్మగాని నాగన్న, ఉప సర్పంచ్ నీరటి సోమయ్య, చెరుకు రాములు, బీ కొమురయ్య, వర్రె వెంకన్న, ఎం సుధాకర్ పాల్గొన్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...