ఐలోని మల్లన్నా..ఆదాయం ఘనమన్నా


Sun,April 14, 2019 02:39 AM

ఐనవోలు, ఏప్రిల్ 13 : జానపదుల జాతరగా పేరుగాంచి, కొలిచిన వారి ఇంట కొంగు బంగారంగా నిలిచే ఐనవోలు మల్లన్న ఆదాయం ప్రతీ ఏటా క్రమక్రమమంగా పెరుగుతూ ఐలోని మల్లన్నా ఆదాయం ఘనమన్నా తీరుగా మారిందని మల్లికార్జునస్వామి ఈవో నాగేశ్వర్‌రావు తెలిపారు. మండల కేంద్రంలో మల్లికార్జునస్వామి ఈవో కార్యాలయం శనివారం విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018-19 సంత్సరానికి గాను మల్లన్న ఆదాయం రూ.3,33,08,707 ఆదాయం వచ్చినట్లుగా వెల్లడించారు.. (ఉగాది ఏప్రిల్ మొదటి వారంలో రావడం వార్షిక ఆదాయంలో ఒక వారంతపు జాతర ఆదాయం జమ కాలేకపోయింది). గత ఏడాది కన్నా సుమారు రూ.20 లక్షల ఆదాయం అదనంగా వచ్చేది అని చెప్పారు. దీనికి తోడు దేవాల యం చరిత్రలో ఇన్ని రోజుల్లో చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తం సుమారు రూ.42 లక్షలుగా ఉందన్నారు. ఈ సంవత్సరం తను చార్జీ తీసుకున్న మూడు నెలల్లో రూ. 50 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. మల్లన్న జాతర నిర్వహణ ఖర్చు, ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్‌తో కలిపి అయిన ఖర్చు రూ.2 కోట్ల 55 లక్షల 42 వేలు. తాను మూడు నెలల క్రితం చార్జీ తీసుకునే సమయంలో దేవాలయం బ్యాంక్ బ్యాలెన్స్ సుమారుగా రూ.49లు, 70 లక్షల అప్పుతో అప్పగించినట్లుగా వివరించారు. ఈ వా ర్షిక సంవత్సరం అన్ని ఖర్చులు, అప్పులు పోను రూ. 50 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.49 వేల నిల్వ ఉంచినట్లుగా వివరించారు.

దాతల సహకారంతో సదన్ కాంప్లెక్స్ నిర్మాణం
మల్లికార్జునస్వామి ఆలయ ఆవరణంలో దాతల సహకారంతో మల్లన్న సదన్ అనే పేరున కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతున్నట్లుగా ఈవో తెలిపారు ఈ కాంప్లెక్స్‌లో 5 ఫ్లోర్లు 75 గదుల ప్రణాళికను సిద్ధం చేశాం. ఇప్పటి వరకు 30 మంది మల్లన్న భక్తులు దాతలుగా మారి గదుల నిర్మాణం కోసం పేర్లు నమోదు చేసుకున్నట్లుగా వివరించారు. ఆదే విధంగా కుడా నిధుల నుంచి రూ. 2 కోట్ల మంజూరు జరిగింది. ఆలయ ఆవరణంలో కల్యాణ మండపం, విశ్రాంత భవనం, తూర్పు వైపున రెండు స్వాగత తోరణాలను నిర్మాణం పనులు కూడా త్వతలో ప్రారంభం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అద్దెంకి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...