నగరంలో భారీ వర్షం


Sat,April 13, 2019 03:17 AM

-ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులు
-విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
-రైల్వేస్టేషన్‌లో పట్టాలపై పడిన రేకులు
-పలుచోట్ల ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
-ధర్మసాగర్‌లో పిడుగుపాటుకు ఇల్లు దగ్ధం
-నేలరాలిన మామిడికాయలు
ఖిలావరంగల్/కరీమాబాద్/న్యూశాయంపేట/హసన్‌ప ర్తి/పోచమ్మమైదాన్: వరంగల్ మహానగరం చల్లబడింది. ఉక్కపోతగా ఉన్న వాతావరణం శుక్రవారంరాత్రి ఒక్కసారి మారిం ది. ఈదురు గాలులు.. ఉరుములు.. మెరుపులతో భారీ వర్షం కురిసింది. గాలుల వేగానికి పలు ప్రాంతాల్లో చెట్లు, కొమ్మలు విరిపడ్డాయి. మరికొన్ని చోట్లు కొమ్మలు కరెంటు స్తంభాలపై విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో సంబంధిత అధికారులు టార్చిలైట్లను పట్టుకొని రాత్రివేళ విద్యుత్ స్తంభాల వెం ట పరుగులు తీశారు. పలు కాలనీల్లోని ప్రజలు గాలి, దుమ్ముధూళితో ఇబ్బందులు పడ్డారు. ఈ దురు గాలికి వరంగల్ రైల్వేస్టేషన్‌లో రేకులు గాలిలోకి లేచి మొ దటి ప్లాట్‌ఫాం రైలు పట్టాలపై పడ్డాయి. వర్షానికి వరంగల్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయమ్యాయి. రైల్వే అధికారులు అప్రమత్తమై హు టాహుటిన మొదటి ప్లాట్‌ఫాంపైకి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పట్టాలపై పడిన రేకులను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా మొదటి ప్లాట్‌ఫాంపై ఆగాల్సిన రైళ్లను రెండు, మూడు ప్లాట్‌ఫాంలపై నుంచి మళ్లించారు. అలాగే ఎస్కలేటర్ కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వం సమయ్యాయి. గాలుల భీభత్సానికి ప్రయాణికులు భయాందోళనలతో విశ్రాంతి మందిరాలలోకి వెళ్లారు. కాగా ఎలాంటి అ వాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆ ర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరదనీరు ని లవడంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. గాలిదుమారానికి ఉర్సులోని సిద్దని రమేశ్ ఇంటిపై తాటిచెట్టు కూలింది. 22వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మొత్తానికి శుక్రవారంరాత్రి ఈ దురు గాలులు, ఉ రుములు, మెరుపులతో కురిసిన వర్షానికి నగ ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తోటల్లో రాలిన మామడి కాయలు
హసన్‌పర్తి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శుక్రవారంరాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలు చోట్ల వి ద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రాత్రి 7:30 గం టల నుంచి ప్రారంభమైన వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలులకు కాతకు వచ్చిన మామిడి కాయలు నేలరాలినట్లు తోట యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో కరంటు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డా రు. ఎండ వేడిమితో అవస్థలు పడుతున్న మండల ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందినప్పటికీ, మామిడి రైతులకు కొంత మేర నష్టం కలిగిందని పేర్కొంటున్నారు.

205
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...