బిజినెస్ ఐడియాలకు మంచి వేదిక


Sat,April 13, 2019 03:14 AM

నిట్‌క్యాంపస్, ఏప్రిల్12: విద్యార్థులు స్టార్టప్‌లు ప్రారంభించడానికి కావాల్సిన బిజినెస్ ఐడియాలను పొందేందుకు ఈ-సమ్మిట్ మంచి వేదిక అని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు అన్నారు. మూడురోజుల పాటు నిర్వహించే ఈ-సమ్మిట్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ సెల్ విభాగం నిర్వహిస్తున్న కార్యక్రమంలో విద్యార్థులు భవిష్యత్‌లో వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన మెళకువలను నేర్చుకోవచ్చని ఆయన తెలిపారు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ఎల్‌ఆర్‌జీ రెడ్డి మాట్లాడుతూ శనివారం నుంచి ఈనెల 16 వరకు నిర్వహించే ఈ-సమ్మిట్‌లో పలువురు పెట్టుబడిదారులు(ఇన్వెస్టర్స్) పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారని తెలిపారు. ఈ వేదిక ద్వారా విద్యార్థులు స్టార్టప్‌లను ప్రారంభించడం వల్ల పారిశ్రామిక వాతావరణ పరిస్థితుల గురించి అవగాహన ఏర్పర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో విన్నీ ప్యాట్రో ప్రస్తుత తరుణంలో బిజినెస్ అవకాశాలు అనే అంశంపై వివరించారు. ఈ-సమ్మిట్‌లో మూడు రోజుల పాటు స్పాట్‌లైట్స్, గెస్ట్‌లెక్చర్లు, ప్యానల్ డిస్కషన్స్, బిజినెస్ వర్క్‌షాప్‌లు రమణారావు చెప్పారు. స్పాట్‌లైట్‌లో స్టార్టప్ ఎక్స్‌పో, ఇంటర్ ఫెయిర్, ఛాయ్ పే చర్చా, లైవ్ స్టాక్ ట్రేడింగ్‌తో పాటు లా స్కూల్ డైరెక్టర్ వెన్సీ కృష్ణ, యంగ్ అచీవర్ డాక్టర్ నిఖిల్ చంద్వాని, లాన్స్‌ఫిట్ డైరెక్టర్ వంశీ సీమకుర్తి గెస్ట్‌లెక్చర్లు నిర్వహిస్తారు. కార్యక్రమంలో టెక్విప్ కోఆర్డినేటర్ కృష్ణనంద్, డీన్ కేవీ జయకుమార్ పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...