స్ట్రాంగ్ రూంలకు భారీ భద్రత


Sat,April 13, 2019 03:11 AM

వరంగల్ క్రైం/కాశీబుగ్గ: వరంగల్ పార్లమెంట్ అభ్య ర్థుల భవితవ్యం తేల్చనున్న ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పత్తియార్డులో గల స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. మార్కెట్ పరిసరాలన్నింటినీ పోలీస్ యంత్రాంగం తమ అధీనంలోకి తీసుకుని, స్ట్రాంగ్‌రూంల చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గురువారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రత్యేక భద్రత మధ్య ఏనుమాముల మార్కెట్‌లోని స్ట్రాంగ్‌రూంలకు ఈవీఎంలను తరలించారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఆరు సెగ్మెం ట్లు (స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చి మ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట), భూపాలపల్లి జిల్లా పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించిన ఈవీఎంలను ఇక్కడ ఉంచారు. కాగా శుక్ర వారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, లోక్‌సభ జనరల్ అబ్జర్వర్ డాక్టర్ వీణా ప్రధాన్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వీ రవీందర్‌తోపాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్ట్రాం గ్ రూంలను పరిశీలించారు. కేంద్ర బలగాల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు తాళాలు వేయించి, సీజ్ చేశారు. అనంతరం రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ కౌంటింగ్ నిర్వహించే మే 23వ తేదీ వరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపర్చనున్నట్లు తెలిపారు. సీపీ రవీందర్ మా ట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్ట్రాంగ్‌రూంలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. మొదటి ద శలో సీఆర్‌ఎఫ్ జవాన్లు, రెండో దశలో ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ ఫో ర్స్, మూడో దశలో స్థానిక పోలీసుల నిఘా ఉంటుందన్నా రు. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని, 24 గం టలు గెజిటెడ్‌స్థాయి పోలీస్ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపా రు. కౌంటింగ్ వరకు పోలీస్ భద్రతతోపాటు సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. ఈవీఎంల భద్రతను వివిధ పార్టీల అభ్యర్థులు సీసీటీవీ పుటేజీల ద్వారా పరిశీలించుకోవచ్చని సీపీ పేర్కొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...