ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు


Fri,April 12, 2019 03:00 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6.30గంటల నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. అసలే ఎండాకాలం కావడంతో ఉదయం పూటనే ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. దీంతో పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే భారీ క్యూలు దర్శనమిచ్చాయి. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించాయి. డోర్నకల్, నెల్లికుదురు, గూడురు, మహబూబాబాద్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ప్రక్రియ ఈవీఎంలు మొరాయించడంతో కాస్త ఆలస్యంగా మొదలైంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.

నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌కు అనుమతించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో మొత్తం 1737 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 14,23,351మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,01,921 మంది పురుషులు, 7,21,383 స్త్రీలు, ఇతరులు47మంది ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో 8475మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించారు. 6వేల మంది పోలీసులతో పాటు 1500మంది సీఆర్పీఎఫ్ బలగాలు బందోబస్తు నిర్వహించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 64.46 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 69.02 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. డోర్నకల్ 72.32, మహబూబాబాద్ 69.47, నర్సంపేట 71.92, ములుగు 66.08, పినపాక 66.82, ఇల్లందు 68.47, భద్రాచలం 68.06 శాతం పోలింగ్ నమోదైంది.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...