నూతన రాజకీయాలకు నాంది


Fri,April 12, 2019 03:00 AM

ఖిలావరంగల్, ఏప్రిల్ 11: దేశంలో నూతన రాజకీయాల ఒరవడికి ఈ ఎన్నికలు నాంది పలుకుతాయని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. గురువారం వరంగల్ పెరుకవాడ రైల్వేగేటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి ఆయన కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో టీఆర్‌ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలిచి ఫెడరల్ ఫ్రంట్ వైపు అడుగులు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 70 ఏళ్ల స్వతంత్య్ర భారతావనిలో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలుండడం విచారకరమన్నారు. దేశ అభివృద్ధి నిరోధకులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో అమలవుత్ను సంక్షేమ పథకాలను యావత్ దేశంలో అమలు చేస్తారన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ బీసీసెల్ అర్బన్ అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్, సిద్దం రాజు తదితరులున్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...