2న సీఎం కేసీఆర్ రాక


Sun,March 24, 2019 02:26 AM

- వరంగల్, భువనగిరిలో సభలు
- 4న మానుకోటలో ..
- పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలకు టీఆర్‌ఎస్ విస్తృత ఏర్పాట్లు

(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ) పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారీ మెజారిటీయే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ముందుకు సాగుతున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పార్టీ దూకుడును పెంచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కాబోతున్నాయని క్షేత్రస్థాయిలో వాతావరణం స్ప ష్టం చేస్తున్నది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్ ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలోని 14 నియోజకవర్గాల్లో విస్తృత కార్యాచరణ రూపొందించారు. ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకర్గం మండలాల వారీగా, గ్రామాల వారీగా విస్తృత ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం పూర్తయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఏ విధంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల్లో కాలికి బలపం కట్టుకొని తిరిగారో అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని తనదైన శైలిలో నిర్వహించాలని భావించారు. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో వచ్చేనెల 2న వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్నారు. వచ్చేనెల 4న మానుకోటలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, కాంగ్రెస్, బీజేపీల నేతృత్వంలో ఆయా పార్టీలు అనుసరిస్తున్న వైఖరులను ప్రజలకు వివరిస్తూనే ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలు, తద్వారా రాష్ర్టానికి కలిగే ప్రయోజనాలు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అనివార్యతల్ని వివరించారు. ఇదే స్ఫూర్తితో వచ్చేనెల 2న వరంగల్‌లో, 4న మానుకోటలో బహిరంగ సభల్లో పాల్గొంటారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...