అన్నారం షరీఫ్ దర్గా ఉర్సు ప్రారంభం


Sun,March 24, 2019 02:13 AM

పర్వతగిరి మార్చి 23 : మండలంలోని అన్నారం షరీఫ్ దర్గా ఉర్సు శనివారం రాత్రి వైభవంగా ప్రారం భమైంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉత్స వాల కోసం భక్తులకు ఏర్పాట్లు చేసినట్లు ఓఎస్‌డీ ప్రత్యే కాధికారి ఎండీ ఖాసీం, ఉర్సు ఇన్‌చార్జి ఖాజానజ్ మొద్దీన్, ఇన్‌స్పెక్టర్ రియాజ్‌పాషా, దర్గా సూపరింటెం డెంట్ ముంతాజ్, వక్ఫ్ బోర్డు సిబ్బంది తెలిపారు. ముజావర్లు దర్గాను శుభ్రం చేసి న అనంతరం ముస్లిం మత పెద్దలు ఖవ్వాళీ పాటలు, భక్తి పాటలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అన్నారం షరీఫ్ గ్రా మంలోని పుర వీధుల్లో ప్రత్యేక ప్రార్థనల నడుమ గంధం ఊరేగింపు నిర్వహించారు. దర్గా, దర్గా పరిసర ప్రాంతాలు, వీధు లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు, యాత్రికులు గంధం ఊరేగింపులో పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు, యాత్రికులకు తాగు నీరు, ఎలాంటి అవాంఛనీయ సంఘనటనలు చోటు చేసుకోకు ండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పర్వతగిరి సీఐ శ్రీధర్‌రావు, ఎస్సై వీరేందర్ తెలిపారు. ఫకీర్ల విన్యాసాలతో, ఖవ్వాళీ కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

మంత్రి ఎర్రబెల్లి ప్రార్థనలు
పర్వతగిరి : అన్నారం షరీఫ్ దర్గా అభివృద్ధికి కృషిచేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. దర్గా ఉర్సుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం రాత్రి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి హజ్రత్ యాకూబ్‌షావళి బాబాకు చాదర్ కప్పి, పూల మాల వేశారు. ముజావర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా దర్శనం అనంతరం మంత్రి ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు. దర్గా చెరువు కట్టను అభివృద్ధి చేస్తానని, చెరువును రిజర్వాయర్‌గా మార్చడానికి సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని చెప్పారు. అన్నారం నుంచి రాయపర్తి, పర్వతగిరి, మేతరాజుపల్లికి వెళ్లే ప్రధాన రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. పూర్వం నుంచే అన్నారం షరీఫ్ దర్గాకు మాకుటుంబంతో పాటు వచ్చేవాళ్లం అని వివనిం,ఆరు. ప్రతి ఎన్నికల సమయంలో ఇక్కడి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, బాబా పాదాల చెంతనే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి నామినేషన్ వేస్తానని చెప్పారు. నాఇష్ట దైవం యాకూబ్ బాబా దర్గాను సీఎం కేసీఆర్ హయాంలో మరింత అభివృద్ధి చేస్తానని వివరించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...