టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది


Sun,March 24, 2019 02:13 AM

ఖిలావరంగల్, మార్చి 23: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టిస్తోందని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మూడు వేల మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు వెళ్లారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జనరంజక పాలనను చూసిన కాంగ్రెస్ నాయకులు భారీగా గులాబీ గూటికి వస్తున్నారన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ పటిష్టతోపాటు కార్యకర్తలకు మార్గదర్శిగా ఉంటూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని చెప్పారు. 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ఏఎంసీ మాజీ చైర్మన్ మంద వినోద్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గోరంట్ల రాజు, సాల్మన్ తదితరులతోపాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. దీంతో తూర్పులో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినట్టేనని పేర్కొన్నారు.

పీసీసీ చీఫ్‌కు పనిచేసే కార్యకర్తలు అవసరం లేదు
కాంగ్రెస్ పార్టీకి సేవచేసి కేడర్‌ను తయారు చేసే వ్యక్తులు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గిట్టదని, కేవలం డబ్బుల సంచులు పట్టుకెళ్లే వారికే ప్రాధాన్యత ఇస్తారని ఏఎంసీ మాజీ చైర్మన్ మంద వినోద్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉంటూ ఎంతో మంది నాయకులను తయారు చేశామన్నారు. అయితే క్రియాశీలక రాజకీయాల్లోకి తాము వచ్చిన తర్వాత కూడా పార్టీలోకి రాని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రవర్తన తీరును వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ న్యాయం చేస్తున్నారన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేందర్ చేస్తున్న అభివృద్ధి పనులు, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుకు హర్షం వ్యక్తం చేస్తూ పార్టీలో చేరుతున్నామన్నారు. కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత వరంగల్‌కు వచ్చిన నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులను టీఆర్‌ఎస్‌లో చేర్పించి ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణు లు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు భారీగా తరలివెళ్లారు. ఖిలావరంగల్, శివనగర్, రంగశాయిపేట, చింతల్, పుప్పాలగుట్ట, ఉర్సు, కరీమాబాద్‌తోపాటు తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి 45 బస్సులు, 70 కార్లు ద్వారా తెలంగాణ భవన్‌కు ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో వెళ్లారు. డివిజన్ల వారీగా వచ్చిన బస్సులను ఎమ్మెల్యే నరేందర్ జెండా ఊపి ప్రారంభించారు.

13,14వ డివిజన్ నాయకులు
కాశీబుగ్గ: నగరంలోని 13, 14వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా శనివారం ఎల్బీనగర్‌లోని డీసెంట్ ఫంక్షన్ హాల్ నుంచి గోరంటల రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలివెళ్లారు. వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గోరంటల రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి తగిన గుర్తింపు లేకుండా పోయిందని అన్నారు. వరంగల్‌తూర్పు అబివృద్ధిని దృష్టిలో పెట్టుకొని టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట దోమకొండ నాగమణి, రజియా, స్వర్గం కవిత, మార్గం శ్రీనివాస్, వీరబత్తిని అంబదాసు, బండారి రమేశ్, పోలెపాక రవీందర్, రాము, ఇదునూరి సన్ని, గాదె రాజు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...