ప్రశాంతంగా పోలింగ్


Sat,March 23, 2019 01:57 AM

- ఉమ్మడి జిల్లాలో 87.81శాతం
- మందకొడిగా మొదలై చివరి రెండు గంటల్లో ఊపందుకున్న ఓటింగ్
- పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అభ్యర్థులు

(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తేతెలంగాణ): ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్ ఉ మ్మడి జిల్లాల్లోని ఉపాధ్యాయ ఓటర్లు ప్రశాంతంగా తమ ఓ టు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని, ఏ ర్పాట్లను బరిలో నిలిచిన అభ్యర్థులు పరశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వివిధ ఉపాధ్యాయల సంఘాల ప్రతినిధులు వారి అభ్యర్థుల కోసం చివరి నిమిషం వరకు శక్తివంచన లే కుండా ప్రయత్నాలు ప్రారంభించారు. వరంగల్ అర్బన్, వ రంగల్ రూరల్, జనగామ, జయశంకర్-భూపాలపల్లి, ము లుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పోలింగ్‌కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. అయితే ఉపాధ్యాయుల్లో ఓటు హ క్కు ఉన్నవారే కాకుండా ఆయా సంఘాలు బలపరిచిన అ భ్యర్థుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఆధిపత్యాన్ని ప్ర దర్శించుకోవటానికి పోటీలు పడ్డారు. ఉమ్మడి వరంగల్ జి ల్లాలో ఉన్న 7686 మంది ఓటర్లకు, 6828 (87.45శాతం) మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా 89.22 శాతం పోలింగ్‌తో ములు గు జిల్లా ముందు వరుసలో ఉండగా, జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో 83.95 శాతం అత్యల్ప పోలింగ్ నమోదైంది. కాగా, అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ కాకతీయ డిగ్రీ కళాశాలలో ని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.

అభ్యర్థుల సందడి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో నిలిచిన అభ్యర్థులు ఆయా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థులు పూల రవీందర్, సంగాని మళ్లేశ్వర్, నర్సింహారెడ్డి, సరోత్తమరెడ్డి ఇలా బ రిలో నిలిచిన మెజారిటీ అభ్యర్థులు వరంగల్ ఉమ్మడి జిల్లాపైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. ఈ అభ్యర్థుల్ని బలరపరుస్తూ, వారి కోసం చివరి వరకు ఆయా ఉపాధ్యాయ సం ఘాల ప్రతినిధులు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. కాగా, వరంగల్ తూర్పు నియోజకర్గంలో పూల రవీందర్‌కు ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్ సహా పలువురు కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా హన్మకొండలోని పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ఆయనకు మ ద్దతు ప్రకటించారు. మొత్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుం డా ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా (జిల్లాల వారీగా) మొత్తం ఓట్లు, పోలైన ఓట్లు, పో లింగ్ సరళి ఈ విధంగా ఉంది.

88.95 శాతం పోలింగ్ నమోదు
అర్బన్ కలెక్టరేట్: జిల్లాలో శుక్రవారం శాసనమండలి ఎ న్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ తెలిపారు. ఖమ్మం, నల్గొండ, వరంగ ల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 4315 మంది ఓటర్లు ఉండగా, వీరికి 10పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. వీరిలో 3838 (88.95 శాతం) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 2374 మంది పురుషులు, 14 64 మంది మహిళలున్నారు. జిల్లాలో మొదటి రెండు గంటల్లో ఉదయం 10 గంటల వరకు 779 మంది (17.91 శా తం), మధ్యాహ్నం 12 గంటల వరకు 2080 మంది (48. 2 శాతం), 2 గంటల వరకు 3388 (78.51 శాతం), సా యంత్రం 4 గంటలకు వరకు 3838 మంది (88.95 శా తం) ఓటు వేశారు. అలాగే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జిల్లాలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 160 మంది ఓటర్లకుగాను 141 మంది (88.13 శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నారు. పట్టభద్రుల ని యోజకవర్గానికి ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాల్లో 2431 మంది ఓటర్లకు గాను 141 6 మంది (58.25 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...