10 మంది అభ్యర్థులు.. 11 నామినేషన్ సెట్లు


Sat,March 23, 2019 01:55 AM

అర్బన్ కలెక్టరేట్, మార్చి 22: వరంగల్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం పది మంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. ఎన్నికల నామినేషన్లకు ఇక సోమవారం ఒక్క రోజు మాత్రమే గడువు మిగిలి ఉంది. నేడు (23వ తేదీ), 24వ తేదీ ఆదివారం సెలవు రోజులు కావడంతో నామినేషన్లు స్వీకరించబడవని తెలిపారు. సుబేదారిలోని పాత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ మాత్రం పనిచేస్తుందన్నారు. కాగా శుక్రవారం టీడీపీ నుంచి హన్మకొండ సమ్మయ్య ఒక సెట్, కాంగ్రెస్ నుంచి దొమ్మాడి సాంబయ్య రెండు సెట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా చిలువేరు ప్రతాప్ ఒక సెట్, అయిత ప్రవీణ్‌కుమార్ ఒక సెట్, జెరిపోతుల ఉపేందర్ ఒక సెట్, బరిగల శివ ఒక సెట్, బీజేపీ నుంచి బొక్కా ప్రభాకర్ ఒక సెట్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి గాదెపాక అనిల్‌కుమార్ ఒక సెట్ నామినేషన్ దాఖ లు చేశారు.

పసునూరి తరుపున నామినేషన్
టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ తరుపున ఆరెల్లి అంజన్‌రావు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం సుబేదారిలోని పాత కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్‌జీవన్ పాటిల్‌కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు.

భద్రకాళిని దర్శించుకున్న పసునూరి
మట్టెవాడ: వరంగల్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ శుక్రవారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈసందర్భంగా దయాకర్‌ను వరంగల్ ప శ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, పశ్చిమ నియోజక వర్గ కోఆర్డినేటర్ రాచర్ల రాము, కల్పలత సూపర్‌బజార్ వై స్ చైర్మన్ ఎండీ షఫీ, గట్టు చందు, గట్టు శివ తదితరులు అభినందించారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...